పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/238

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

5. మరణం తర్వాత జీవం

మనం ఎంత అధికంగా క్రీస్తుమరణాన్ని మరణిస్తామో అంత అధికంగానే అతని జీవాన్ని జీవిస్తాం - 2 కొ 4,10. అందరమూ మరణానికి లొంగవలసిందే. కాని అటుపిమ్మట మల్లా జీవాన్ని పొందుతాం. మనకు చనిపోవడమంటే క్రీస్తుని చేరుకొని అతనితో వుండిపోవడమే - ఫిలి 1, 23. ఉత్థానానంతరం క్రీస్తుని ఉన్నవాణ్ణి ఉన్నట్లుగా దర్శించి అతనిలాంటివాళ్ళ మౌతాం - 1 యోహా 32. ఇదే దివ్యదర్శనం, మోక్షజీవితం. ఆ దివ్యజీవితంలో దేవుడు మానవులతో కలసి వసిస్తాడు. వాళ్లు అతని ప్రజలూ, అతడు వారికి దేవుడూ ఔతారు-దర్శ 21,3. ఆ మోక్షంలో దేవునినుండీ, క్రీస్తు నుండీ బయలుదేరి ఒక జీవనది ప్రవహిస్తూంటుంది - 22,1. దాని వొడ్డున మరల జీవవృక్షం తగులుతుంది. దాని ఫలాలను మనం ఆరగిస్తాం - 22,14.

ఆ మోక్షజీవితంలో దేవుడు మృత్యువుని నాశంచేస్తాడు - 21,4. అక్కడ సింహాసనంపై కూర్చుండివున్నగొర్రెపిల్ల మోక్షవాసులకు కాపరి ఔతుంది. వారిని జీవజలాల వద్దకు నడిపించుకొని పోతుంది - 7,17. అనగా మోక్ష వాసులకు క్రీస్తు శాశ్వతంగా దివ్యజీవాన్ని ప్రసాదిస్తాడని భావం.

ప్రార్ధనా భావాలు

1. పౌలు ఇప్పడు నేనుకాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు అనిచెప్పకొన్నాడు - గల 2,20. ఇంకా అతడు నాకు జీవించడమంటే క్రీస్తుని జీవించడమే అనికూడవచించాడు - ఫిలి 1,21. ఈ వాక్యాలు క్రైస్తవులమైన మనకందరికీ ప్రేరణం పట్టించాలి. మనం క్రీస్తునే సర్వస్వంగా భావించేలా చేయాలి.
2. ఇప్పడు మనం పవిత్రాత్మ సహాయంతో క్రీస్తు జీవితం జీవిస్తాం. కాని మనం ఆ యాత్మకు లొంగితేనేగాని ఈ క్రీస్తు జీవితం జీవించలేం - గల 5,25.
3. క్రీస్తు వాక్కు మనకు నిత్యజీవమిస్తుంది - యోహా 6,68. కనుక ఆ వాక్కుని బైబులు గ్రంథంనుండి రోజురోజు భక్తితో ధ్యానం చేసికోవాలి.
4. మనలో దివ్యజీవం వుంది అనడానికి గుర్తు సోదరప్రేమే. మనం సోదరులను ప్రేమిస్తున్నాం గనుక మృత్యువును వదలించుకొని జీవంలో వసిస్తాం - 1 యోహా 3,14. కనుక సోదరప్రేమ లేండే దివ్యజీవనం లేదు.
5. లోకంలోని జనం ఎప్పడూ జీవం కొరకూ, సుఖజీవం కొరకూ తపించి పోతూంటారు. వాళ్లు దీనికొరకు లోక వస్తువులను ఆశ్రయిస్తారు. కాని మనకు యథార్థమైన జీవమిచ్చేది దేవుడు చేసిన వస్తువులు కాదు, దేవుడే అతడు జీవపు చలమ, కనుక భక్తుడు అతన్ని పూజించుకొని పూర్ణజీవాన్ని పొందాలి.