పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/239

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

16. గృహ నిర్మాత

1. ప్రభువు యిస్రాయేలును ఇంటినిలాగ నిర్మించాడు

ప్రథమంలో యిప్రాయేలీయులు గూడారాలూ ఇళ్ళూ నగరాలూ నిర్మించుకొని వాటిల్లో జీవించారు. ఈ యనుభవంనుండి ప్రభువు యిస్రాయేలు ప్రజనే ఒక జాతిగా నిర్మించాడు అనే భావం ప్రచారంలోకి వచ్చింది. దాని పట్టుపూర్వోత్తరాలను పరిశీలిద్దాం.

1. దేవుడు ప్రజలను నిర్మించాడు

యాకోబు సుక్కోతులో తనకొక యిల్ల కట్టుకొన్నాడు. పశువులకు పాకలు వేయించాడు - ఆది 33,17. కయీను ఒక నగరాన్ని నిర్మించి దానికి హానోకు అని పేరు పెట్టాడు - ఆది 4, 17. కాని దేవుని దీవెనలేందే ఏ నరుని కృషీ ఫలించదు. ప్రభువు ఇల్లు కట్టకపోతే బేలుదారుల శ్రమ వ్యర్థమే ఔతుంది - కీర్త 127,1. కనుక ప్రభువు యిప్రాయేలీయులకు ఇండూ నగరాలూ నిర్మించుకొనే సామర్థ్యం దయచేసాడు అనుకోవాలి. ఐతే, యిస్రాయేలీయుల కట్టడాలన్నిటిలోను గొప్పది వారి దేవాలయం.

ఈలా యిస్రాయేలీయులు ఇండ్లు నిర్మించుకొంటూంటే, ప్రభువు వారిని ఒక ప్రజగా నిర్మించాడు, అతడు మొదట ఆదాము ప్రక్కటెముకను తీసికొని దాన్ని స్త్రీ నిగా మార్చాడు. ఇక్కడ ప్రభువు ఏవను సృజించాడు, నిర్మించాడు అని రెండర్గాలూ చెప్పవచ్చు. ఏవ పట్టుక వలన ఆదాముకి ఒక కుటుంబం ఏర్పడింది. వాళ్లు దేవునికి దీవెనతో బిడ్డలను కని కొన్ని కుటుంబాలనూ తెగలనూ, ఒక జాతినీ ఉత్పత్తి చేసారు. ఈలా మానవజాతి పెరిగిపోయింది, దావీదు దేవుని మందసానికి ఓ భవనం కట్టబోయాడు. ప్రభువు దావీదు భక్తికి మెచ్చుకొని తానే అతనికొక భవనాన్ని కట్టిపెట్టాడు. ఆ భవనం ఏమోకాదు, అతని రాజవంశమే. ఈ రాజవంశంనుండే తర్వాత మెస్సీయా ఉద్భవిస్తాడు - 2 సమూ 7.11. ప్రభువు యిర్మీయా ప్రవక్త ద్వారా "నేను యిప్రాయేలును భవనంగా నిర్మిస్తానుగాని పడగొట్టను. మొక్కవలె నాటుతానుగాని పెల్లగింపను" అని చెప్పించాడు - 24,6, ఇక్కడ ప్రభువు యిప్రాయేలును నిరంతరమూ ఓ యింటినిలాగ కట్టుకొని పోతుంటాడని భావం.

2. ప్రభువు నిర్మించేవాడూ పడగొట్టేవాడూ కూడ

ప్రభువు జాతులను ఇంటిలా కట్టగలడు, ఇంటిని పడగొట్టినట్లుగా పడగొట్టగలడు. కనుకనే అతడు యిర్మీయా ప్రవక్తతో
"ఈ దినం జాతులమీదా రాజ్యాలమీదా
నేను నీకు అధికారం ఇస్తున్నాను
నీవు వాటిని పెల్లగించడానికీ కూలద్రోయడానికీ