పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పాలంటే, కీర్తనకారుడు వాకొన్నట్లు ద్రాక్షరసం నరునికి ఆనందాన్ని కలిగిస్తుంది - 104, 15, ఇది ద్రాక్షరసాన్ని గూర్చిన బైబులు సంప్రదాయం.

2.యిస్రాయేలు పాడు ద్రాక్షతోటలాంటివాళ్ళ

యిస్రాయేలీయులు ఎప్పడూ పెడసరపుబుద్ధికలవాళ్లే వాళ్లు ఏనాడూ దేవుని ఆజ్ఞలు పాటించి యెరుగరు. ఈ యంశాన్నే యెషయా ప్రవక్త తన సుప్రసిద్ధమైన ద్రాక్షతోట పాటలో వివరించాడు :

"నేను నా స్నేహితునికి ఓ పాట పాడతాను
నా చెలికానిని, అతని ద్రాక్షతోటనుగూర్చి గానంచేస్తాను
సారవంతమైన కొండపై
నా మిత్రునికి ఓ ద్రాక్షతోట వుంది
అతడు ఆ తోటను త్రవ్వి రాళ్లేరివేసి
మేలైన ద్రాక్షతీగలు నాటాడు
తోట నడుమ బురుజుకట్టి
రసం తీయడానికి తొట్టిని తొలిపించాడు
అతడు ద్రాక్షపండ్ల కొరకు ఎదురుచూచాడు
కాని ఆ ద్రాక్షతోట పల్లని కాయలు కాచింది
కనుక యెరూషలేము పౌరులారా! యూదావాసులారా!
మీరు నాకూ నా తోటకూ తీర్పు చెప్పండి
నేను నా తోటకు చేయవలసిన
సేవలన్నీ చేసానుగదా!
మంచి పండ్లు ఫలిస్తుందని నేను కాచుకొని వుండగా
అది పుల్లని కాయలు కాయనేల?
యిస్రాయేలు ప్రజలు సర్వశక్తిమంతుడైన ప్రభువు ద్రాక్షతోట,
యూదా ప్రజలు అతనికి ప్రీతిగొల్పే వనం
అతడు న్యాయాన్ని అపేక్షించాడుగాని
ప్రజలు హత్యకు పాల్పడ్డారు
అతడు నీతిని కాంక్షించాడుగాని
అన్యాయానికి బలియైనవారి యేడ్పులు విన్పించాయి"
-5,1-7.యావే తోటకాపు ఐతే యిస్రాయేలీయులు అతడు నాటిన ద్రాక్షతోట. అతడు మంచిపండ్లు ఆశిస్తే అది వెర్రేసి పుల్లని కాయలు కాచింది. దేవుడు ప్రజలనుండి న్యాయాన్ని