పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ క్రీస్తు మీదికి పావురం రూపంలో దిగివచ్చింది. పావురంలా రావడం దేనికి? ఇది ఓ సంకేతం.యూదుల భావాల ప్రకారం పావురం ప్రజానీకాన్ని సూచిస్తుంది. క్రీస్తువరకు ఉంది పూర్వవేద ప్రజ. అతనితో నూత్నవేద ప్రజ, మెస్సీయా ప్రజ ప్రారంభమౌతుంది. ఇక్కడ ఈ పావురం, ఈ నూత్న ప్రజకు చిహ్నం. సృష్ట్యాదిలోనే దేవుని ఆత్మ ఓ పక్షిలాగ జలాలమీద అల్లల్లాడుతూంది -ఆది 1,2. ఇక్కడ మెస్సీయాతో క్రొత్త సృష్టి క్రొత్త ప్రజ ప్రారంభమౌతుంది అని ఈ పక్షి సంకేతం భావం.

3. క్రీస్తు జ్ఞానస్నానం పొందింది యోర్దాను నదిలో భక్తులు ఆ నదిలో దిగగా యోహాను వాళ్ళను నీటిలో మంచేవాడు. ఆ పిమ్మట వాళ్ళు ఏటినుండి వెలుపలికి వచ్చేవాళ్ళు. యెర్గాను నదికి బైబుల్లో చాల సంకేతాలున్నాయి. పూర్వం యూదులు రెల్లసముద్రం దాటి వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. వాళ్ళలాగే క్రీస్తుకూడ ఓ సముద్రం దాటి, ఓ వాగ్దత్తభూమి చేరుతాడు. ఇక్కడ క్రీస్తు యోర్దానులోకి దిగటం అతడు రెల్లసముద్రం దాటడం లాంటిది. అతడు చేరుకొన్న వాగ్దత్తభూమి మోక్షమే.

3. క్రీస్తు జ్ఞానస్నానం అతని మరణోత్ధానాలకు చిహ్నం

రెల్లుసముద్రపు నీళ్ళు ఐగుప్తియులకు మృత్యువనీ యిస్రాయేలీయులకు జీవాన్నీ తెచ్చిపెట్టాయి. ఆలాగే యోర్దాను నీళ్ళకూడ క్రీస్తు మరణాన్నీ జీవాన్నీ సూచిస్తాయి. నదిలోకి దిగడం అతని మరణాన్ని సూచిస్తుది. ఇక్కడ ఈ రెండంశాలను పరిశీలిద్దాం. మొదటిది క్రీస్తు మరణం. "ఇతడు నా ప్రియకుమారుడు" అని తండ్రి పలికిన సాక్ష్యం యెషయా ప్రవక్త వర్ణించిన బాధామయ సేవకుణ్ణి తలపునకు తెస్తుంది అని చెప్పాం - 42,1. ఈ సేవకుడు ప్రజలకోసం ప్రాణాలు అర్పించాడు. అలాగే క్రీస్తుకూడ ప్రజలకోసం అసువులర్పించాడు. ఇంకా, క్రీస్తు "నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటుంది. దాన్ని పొందిందాకా నాకు విశ్రాంతి లేదు" అన్నాడు — లూకా 12,50. ఏమిటి ఈ బాప్తిస్మం? అతని శ్రమలూ మరణమూను. గ్రీకు భాషలో బాప్తిస్మం అంటే ముంచడం. నరుడు నీళ్ళల్లో మునిగినట్లుగా క్రీస్తు బాధల్లో మునిగితేలుతాడు. కనుక ఇక్కడ అతని జ్ఞానస్నానం అతని పాటులే. ఈ రీతిగా క్రీస్తు యోర్దను నీళ్ళల్లోకి దిగడం అతని మరణాన్ని తెలియజేస్తుంది.

రెండవది, క్రీస్తు ఉత్ధానం. అతడు యోర్దానునుండి వెలుపలికి వచ్చాడు. ఈ నిర్గమనం అతడు సమాధినుండి వెలుపలికి రావడం లాంటిది. కనుక యోర్దాను నీళ్ళలో నుండి వెలుపలికి రావడం అతని ఉత్థానానికి చిహ్నం.