పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భౌతికంగా మరియ క్రీస్తుకి మాత్రమే తల్లి, కానీ ఆధ్యాత్మికంగా క్రీస్తుని విశ్వసించే వాళ్ళందరికీ తల్లి, అలాగే యోహాను వ్యక్తిగతంగా క్రీస్తుకి శిష్యుడు. కాని ఆధ్యాత్మికంగా శిష్యులమైన మనలందరిని తనలో ఇముడ్చుకొని క్రీస్తుకి ప్రియ శిష్యుడౌతాడు. క్రీస్తుకి ఆనాడు అతడు పల్కిన సాక్ష్యాన్నేనేడు మనమూ పల్కుతుండాలి. అనగా క్రీస్తుని భక్తితో విశ్వసిస్తుండాలి. అనగా క్రీస్తు స్థాపించిన తిరుసభా అతని శిష్యవర్గమూ లోకాంతం వరకు కొనసాగిపోతుండాలి.

కానావూరి అద్భుతంలోని మరియకూ ఇక్కడ సిలువ క్రింద నిలబడివున్న మరియకూ సంబంధం వుంది. కానావూరి వివాహంలో మరియు ద్రాక్షరసాన్ని సరఫరా చేయమని క్రీస్తుని అడిగింది. ఈ రసం రక్షణానికి చిహ్నంగా వుంటుంది. అక్కడ క్రీస్తు ఓ స్త్రీ నా గడియ ఇంకా రాలేదు అన్నాడు. ఆ గడియ అతని సిలువ మరణమే. క్రీస్తు సిలువ మిూద వేలాడేప్పడు ఆ గడియ వచ్చింది. కనుక అతడు సిలువ మిూది నుండి మళ్లీ "ఓ స్త్రీ ఇదిగో నీ కుమారుడు" అన్నాడు. ఇక్కడ "ఓ స్త్రీ అన్న మాట ముఖ్యం. ఇక్కడ ఈ పదం తొలి ఏవను సూచిస్తుంది. ప్రభువు అలా పల్కిన సమయంలోనే తన రక్షణాన్ని సమృద్ధిగా దయచేసాడు. ఆ రక్షణాన్ని పొంది రెండవ యేవ ఐన మరియ ఆధ్యాత్మికంగా క్రొత్త సంతానాన్ని కంటుంది. ఈ సంతానం యోహాను భక్తబృందమూ, మనమూ, ఇంకా భావికాలంలో క్రీస్తుని విశ్వసించే వాళ్ళంతా కూడ. కనుక ఈ ఘట్టంలో మరియు తిరుసభను, తొలి యేవనూ, కానావూరి మరియనూ సూచిస్తుంది. యోహాను తన్నూతన చుటూ ప్రోగైన భక్తబృందాన్నిభావి కాలంలో రాబోయే శిష్యులనూ సూచిస్తాడు. ఈలాంటి లోతైన భావాలు ఎన్నో ఈ ఘట్టంలో ఇమిడి వున్నాయి.

4. క్రీస్తు మరణం - 19,28-30

సిలువ మిద వ్రేలాడే క్రీస్తు అంతా ముగిసిందని గ్రహించాడు. తల్లి మరియను రక్షణ కొరకు యోహానుకి అప్పగించాడు, యోహాను ఇంట భక్త బ్రుంధం ప్రోగవుతుంది. మరియు ఆ బృందంలో చేరుతుంది. క్రీస్తు తండ్రి తన కొప్పజెప్పిన పనులన్నీ చేసి ముగించాడు. తాను ఈ లోకాన్ని వీడి తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన గడియ సమిూపించింది. 13,1. మరణం ద్వారా అతడు తండ్రిని చేరుతాడు. కనుక అతడు సిలువ మరణానికి సిద్ధమయ్యాడు.

ఆ చివరి క్షణాల్లో అతడు "నాకు దాహమౌతుంది" అని పల్మాడు. సైనికులు సముద్రపు పాచిని పలిసిన ద్రాక్షరసంలో మంచి హిస్సోవు మండమిూద పెట్టి క్రీస్తుకి అందించారు. ప్రభువు ఆ రసాన్ని త్రాగాడు. తొలి మూడు సువిశేషాల్లో ప్రభువు ఈ