పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవర్తింపవచ్చునని భావం కాదు. దానికి ఈయగూడని ప్రాముఖ్యం ఈయనక్కరలేదని అభిప్రాయం.

3. మనం చేసే పొరపాట్ల

క్రీస్తు శిష్యులంగా మనం నిర్మల జీవితం గడపాలి. నిర్దోషులంగా జీవించాలి. కాని శిష్యులమైనంత మాత్రాన్నే మన బలహీనతలు పోవు. కనుక అందరమూ చాలా పొరపాట్లు చేస్తుంటాం. కాని ప్రభువు తన జీవితాదర్భంద్వారా నైతేనేమి, తన బోధలద్వారా నైతేనేమి, తాను తిరుసభకు దయచేసిన ఆత్మద్వారా నైతేనేమి నిరంతరం మనలను చక్కదిద్దుతుంటాడు. తప్పిపోయినపుడెల్ల మనలను తిరిగి మందలోనికి చేరుస్తుంటాడు. ఈ యధ్యాయంలో మామూలుగా మనం చేసే పొరపాట్లు, క్రీస్తు మనలను చక్కదిద్దే తీరూ తెలిసికొందాం.

1. దేవుణ్ణి నమ్మం

దేవుడు మనలను పట్టించుకొంటాడనీ, ప్రేమిస్తాడనీ అంతగా నమ్మం. మనలో ఎన్నోలోపాలు అవకతవకలు ఉంటాయి. కనుక సర్వగుణ సంపూరుడైన దేవుడు మనలను మెచ్చుకోడని మన భయం. దేవుడు మన అవసరాలను తీర్చి మనలను ఆదుకొంటాడని గూడ అంతగా నమ్మం. అందుకే మన భద్రతకోసం అనేక లోకవస్తువులు కూడబెట్టు కొంటాం. అవి మనలను కాపాడతాయని బ్రాంతి పడతాం. కాని దేవుని సహాయంలేకుండ ఏ వస్తువూ, ఏ వ్యక్తి మనలను కాపాడలేవు.

దేవుణ్ణి నమ్మవలసినంతగా నమ్మకపోవడం మన ప్రధాన బలహీనతల్లో వొకటి. కాని ఈ విషయంలో మన గురువైన క్రీస్తు మనలను చక్కదిద్దుతాడు. అతడు దేవుడు కరుణామయుడనీ అతన్ని ప్రేమించమనీ మనకు తెలియజేస్తాడు. ఆ తండ్రి మన లోపాలతోపాటు సదుణాలతో పాటు మనలను ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా అంగీకరిస్తాడని నేర్పుతాడు. దేవుడు ఎల్లప్పడు నరులను కాచి కాపాడుతుంటాడనే సత్యాన్ని రూఢిగా నమ్మమని మనకు విశదం చేస్తాడు. దీనివల్ల మనం అంతగా నమ్మని దేవుణ్ణి నమ్మడం నేర్చుకొంటాం. అతన్ని అధికంగా ప్రేమిస్తాంగూడ.

2. మనమీద మనకే ఇష్టం ఉండదు

చాలమంది వాళ్ళనువాళ్ళే అంగీకరించుకోరు, ప్రేమించరు. మనమంటే మనకే యిష్టం ఉండదు. మన లోపాలను ఎక్కువగా గమనించి మన శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకొంటాం. ఇతరులతో పోల్చి చూచుకొని మనం కొరగానివాళ్ళమని