పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాధపడతాం. లోకంలో మనం చేయగల మంచిపని లేదో అన్నట్లుగా జీవితంలో వెనక్కువెనక్కు పోతాం. ఇతరులతో కలవకుండ వొంటరిగా ఉండిపోతాం. మనలను మనం నిరాకరించుకొని అప్రయోజకులమైపోతాం.

మనలను మనమే నమ్మకపోవడం మన ముఖ్య లోపాల్లో వాకటి. ఇక్కడకూడ మార్గదర్శకుడైన క్రీస్తు మనలను సవరిస్తాడు. ఆ ప్రభువు మనలందరినీ అంగీకరిస్తాడు, ప్రేమిస్తాడు. మనలో ఒక్కొక్కరితోను నీవు నాకు అమూల్యమైనవాడివి, నీవంటె నాకు ఇష్టం అని చెప్తాడు. ఈలా క్రీస్తు తండ్రి క్రీస్తూ మనలను అంగీకరిస్తుంటే, మనంకూడ విలువైన వాళ్ళమేననే అభిప్రాయం మనకు కలుగుతుంది. ప్రభువమనతో మీరుబలహీనులై నా ఇబ్బందిలేదు. కాలుజారి కిందపడిపోయేవాళ్ళయినా పర్వాలేదు. మీరు మళ్ళాపైకిలేస్తే చాలు అని చెప్తుంటాడు. దీనివలన మనం ఉత్సాహం తెచ్చుకొంటాం. మనలను మనం నమ్ముతాం, అంగీకరించుకొంటాం.

3. ఇతరులంటే ఇష్టం ఉండదు

సమాజంలో చాలమందిని మనం అనిష్టంతో చూస్తాం. కొందరికి ఆడవాళ్ళంటే యిష్టం ఉండదు. కొందరికి మగవాళ్ళంటే గిట్టదు. కొందరికి పలానా కులం వాళ్ళంటే, పలానా ప్రాంతం వాళ్ళంటె, పలానా మతం వాళ్ళంటే పడదు. ఇతరులను గూర్చి మనకెన్నో అపోహలూ, అపార్థాలూ, కోపతాపాలూ, అసూయలూ ఉంటాయి. మన బంధువుల్లోనే, ఆమాటకొస్తే మన కుటుంబసభ్యుల్లోనే కొందరంటే మనకు పడదు. ఇక మనం ప్రేమించేదెవరిని? బహుశ చాల కొద్దిమందినే.

ఈ యంశంలోగూడ మన బోధకుడైన క్రీస్తు మనకు తోడ్పడతాడు. అతడు మనం ఇతరులను అంగీకరించి ప్రేమించాలని నేర్పుతాడు. తన ప్రేమాత్మను మనపై కుమ్మరించి మనం ఈ కార్యంలో విజయం సాధించేలా చేస్తాడు. మనకు అపరాధం చేసినవాళ్ళను మన్నించమని ప్రబోధిస్తాడు. దేవుణ్ణి తోడినరుల్లోనే దర్శించమని హెచ్చరిస్తాడు. మనలను మనం కాసేపు మర్చిపోయి తోడివారికి సేవలు చేయమని మందలిస్తాడు. దీనివల్ల మన ప్రవర్తనం మాగుతుంది. ఇతరులను విలువతో చూడ్డం అలవాటు చేసికొంటాం.

4. లోక వస్తువులను నమ్ముతుంటాం

భగవంతుణ్ణి తోడినరులనూ నమ్మవలసినంతగా నమ్మకపోవడంవల్లనే లోక వస్తువులను ఆశ్రయిస్తాం. వీటి ద్వారా మనలోని అభద్రతా భావాన్ని తొలగించుకోజూస్తాం. ఇందుకే కొందరు ఆస్తులు, ధనం కూడబెట్టుకోగోరుతారు. కొందరు అధికారాలూ, పదవులూ