పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈనాడు చెప్పేది చేయని క్రైస్తవ బోధకులకుగూడ ఈ ఖండనం అక్షరాల వర్తిస్తుంది. కనుక క్రైస్తవ బోధకుడు మొదట తనకు తాను బోధచేసికోవాలి. తాను బోధించేది తానే ఆచరించాలి. అతడు మాటలద్వారానేగాక చేతలద్వారాగూడ బోధించాలి. అప్పడే అతని వెలుగు నలువైపులా ప్రసరించేది — మత్త 5,16. మనకు చెప్పవలసిన సందేశమేమో లేకపోలేదు. చాల గొప్ప సందేశమే వుంది. కాని ఆ సందేశాన్ని విన్పించడానికి భగవంతుణ్ణి వ్యక్తిగతంగా అనుభవానికి తెచ్చుకొన్నవాడు. కనుక అతడు తన శిష్యులకు ఏవేవో సూత్రాలూ నిర్వచనాలూ బోధింపడు. వాళ్ళచేత ఏవేవో కర్మకాండలు చేయించడు, వాళ్ళను నేరుగా దైవసాన్నిధ్యంలోకి నడిపించుకొని పోతాడు. వాళ్ళకు దేవుణ్ణి సాక్షాత్కారం చేస్తాడు. మీరు గూడ ఆ పనిని చేయగలిగితే ప్రజలు మీ బోధ తప్పకుండా వింటారు".

ఈ సన్యాసి వాక్యాల్లో ఎంతో విలువుంది. కనుక మనం క్రీస్తునిగూర్చి చెస్తే ప్రజలు మన బోధ ఆలిస్తారా అనేది ప్రశ్నకాదు. అసలు ప్రశ్న ఏమిటంటే మనం ఆ క్రీస్తుని అనుభవానికి తెచ్చుకొన్నామా అన్నది. ఆ ప్రభువు బోధలను మన జీవితంలో ఆచరించి చూపిస్తున్నామా అన్నది నిజమైన ప్రశ్న.

ఆచరణలేని బోధను డంబం అంటారు. క్రీస్తు ఈ డాంబికత్వాన్ని తీవ్రంగా ఖండించాడు, ఆనాటి పరిసయులు మోషే ధర్మశాస్తాన్ని పెద్ద గొంతుతోనే బోధించారు. కాని వాళ్ళు స్వయంగా దాన్ని పాటించలేదు. కనుక ప్రభువు ఈ బోధకులను ఏవగించుకొన్నాడు. వాళ్ళ డంబాన్ని ఖండించాడు. వాళ్ళ సున్నం గొట్టిన సమాధులన్నాడు, గుడ్డి ప్రజలను నడిపించే గుడ్డి నాయకులు అన్నాడు. ఈ బోధకులు తాము చెప్పేది తామే చేయడంలేదు కనుక ప్రజలు వాళ్ళ క్రియలను అనుకరింపగూడదన్నాడు - మత్త 238. విశ్వాసయోగ్యులైన బోధకులు మాత్రమే కరవైపోయారు.

మనమేమో బోధ చేయవలసిందే. అది ప్రభువు ఆజ్ఞ మీరు వెళ్ళి సకలజాతి జనులకు నన్నుగూర్చి బోధించండి అన్నాడు క్రీస్తు — మత్త28,19, కాని ఏలా బోధించాలి? ఆచరణశుద్ధితో మరో మార్గం ఫలదాయకం కాదు. కనుక ఆచరణశుద్ధి అన్నిటికంటె ముఖ్యమైన శిష్యలక్షణం అని చెప్పాలి.