పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. ఇక మన దేశంలో తొలి శతాబ్దంనుండి కూడ బోధకులు క్రైస్తవ మతాన్ని బోధిస్తూ వచ్చారు. కేరళ ప్రాంతంలో క్రీస్తు శిష్యుడు తోమాసో లేక ఆ భక్తుని అనుయాయులో బోధ చేసారు. ఆనాటి సమాజంలోని అగ్రవర్గాలవాళ్ళ ఆ బోధలను అంగీకరించి క్రైస్తవ మతం చేపట్టారు. ఆలాగే 18, 19 శతాబ్దాల్లో తిరుచురాపల్లి చుట్టుపట్ల యేసుసభ గురువులు బోధ చేసారు. ఆ బోధలు ఆలించి ఆ ప్రాంతంలోని బ్రాహ్మణులు క్రైస్తవ మతాన్ని అంగీకరించారు. ఈ బోధకులంతా చిత్తశుద్ధి కలవాళ్లు, వాళ్లు ఉపదేశమూ ఆచరణమూ - రెండింటినీ పాటించారు. హైందవులు క్రైస్తవ ధర్మాన్నిస్వీకరించినకాడల్ల చిత్తశుద్ధికల ఓ క్రైస్తవ భక్తుడు కారణంగా కన్పిస్తాడు. కాని నేడు క్రైస్తవుల సంఖ్య పెరిగిపోయేకొద్దీ ఆచరణశుద్ధి తరిగిపోతూంది. మంది ఎక్కువైతే మట్టిగ పల్పనయింది అన్నట్లుగా తయారయింది. ఇది ఓ పెద్ద దౌర్భాగ్యం.

5. ఈ సందర్భంలో గాంధీగారి భావాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం మంచిది. ఆయన క్రైస్తవ బోధకుణ్ణి ఓ గులాబీ పూవుతో పోల్చాడు. గులాబీ తన పరిమళాన్ని గూర్చి ఉపన్యాసాలీయదు. ఆ పరిమాళాన్ని వ్యాపింపజేస్తుంది అంతే. ఆలాగే బోధకుడు కూడ తన పరిమళాన్ని వ్యాపింపజేయాలే గాని దాన్ని గూర్చి చెప్పకూడదు. అనగా అతడు సువార్తను బోధించడంకంటె నిజజీవితంలో దాన్ని జీవించడం మెరుగు. సువార్త కుండే పరిమళం వుండనే వుంది. సత్యానికుండే విలువ మరి దేనికుంటుంది? కనుక సువార్తను గూర్చి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. మన జీవితాల్లో దాని పరిమళాన్ని చూపించగలిగితే చాలు, నరులు ముగ్గులైపోతారు. జీవించి చూపించడం బోధించడం కంటెగూడ బలమైన బోధ.

గాంధిగారి అభిప్రాయం ప్రకారం చాలమంది క్రైస్తవుల్లో ఆచరణశుద్ధి ඒක. అందుచేత ఆయన "నాకు క్రీస్తంటే ఎంతో ఇష్టం. కాని క్రైస్తవులంటే ఇష్టంలేదు" అని చెప్పేవాడు. క్రీస్తు పర్వతప్రసంగం గాంధీని ఎంతో ప్రభావితం చేసింది. కాని ఈ ప్రసంగం ప్రకారం జీవించే క్రైస్తవులు ఆయనకు అట్టే తగల్లేదు. కనుక మహాత్మునికి క్రైస్తవులపట్ల గౌరవం కలగలేదు. చిత్తశుద్ధిలేని భక్తులను ఎవరు గౌరవిస్తారు?

ఇంకా ఓమారు ఓ హిందూ సన్యాసి ఓ క్యాతలిక్ గురువుతో ఈలా చెప్పాడు, "అయ్యా! మీవాళ్ళు చాలమంది క్రీస్తుని బోధిస్తున్నారు గాని మా ప్రజలు మాత్రం మీ బోధలను అట్టే పట్టించుకోవడంలేదు. దీనికి ఓ కారణం వుంది. ఈ ప్రజలను క్రీస్తు దగ్గరికి చేర్చాలంటే మీరు మా హిందూ సంప్రదాయంలోని గురువుల్లా తయారు కావాలి. హైందవ గురువు ఏవో గ్రంథాల్లోనుండి కొన్ని వాక్యాలు వల్లెవెసేవాడు కాదు. అతడు