పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాణాన్ని పోగొట్టుకొన్న స్త్రీ సామెతలో - లూకా 15,8-10. ఈ కథలో ఓ గృహస్తురాలికి పది నాణాలున్నాయి. వాటిల్లో ఒక్కటి జారిపోయింది. ఆమె దానికోసం శ్రద్ధగా వెదికింది. దీపం ముట్టించి ఇల్లంతా ఊడ్చింది. చివరకు ఆ నాణెం దొరికింది. ఆమె యిరుగుపొరుగు స్త్రీలను పిల్చి పోయిన నా కాసు దొరికింది. నాతోపాటు మీరుకూడ ఆనందించండి అని చెప్పింది.

ఈ సామెతలోని భావం ఇది. స్త్రీ జారిపోయిన నాణిం దొరికినపుడు ఆనందించినట్లే దేవుడు పాపి పరివర్తనం చెందినపుడు ఆనందిస్తాడు. దేవుని ప్రతినిధిగా వచ్చిన క్రీస్తుకూడ పాపులు పరివర్తనం చెందినపుడు సంతోషిస్తాడు. దేవునికీ, క్రీస్తకీ పావులంటే ఇష్టం, దయ. ఆ పాపులు పరివర్తనం చెంది దేవునితో రాజీపడాలి. అతడు ఇప్పడు క్రీస్తుద్వారా వాళ్ళను స్వయంగా వెదుక్కొంటూ వస్తున్నాడు.

ఈ సామెతలో క్రీస్తు ఓ గృహస్తురాలిని యావే ప్రభువుతో పోల్చడానికి వెనుకాడలేదు. కనుక దేవుణ్ణి స్త్రీనిగా, తల్లినిగా భావించడం అతనికి ఇష్టమే అనుకోవాలి.

2. రొట్టెలు చేసే స్త్రీగా దేవుడు :

క్రీస్తు యావేను రొట్టెలు కాల్చే స్త్రీతో పోల్చాడు. ఈ సందర్భంలో అతడు ఈ సామెతను చెప్పాడు. దైవ రాజ్యాన్ని దేనితో పోలుస్తాను? ఓ స్త్రీ పులిపిడి ద్రవ్యాన్ని మూడు కుంచాల పిండిలో వుంచగా ఆ పిండంతా పులియబారింది — లూకా 17,20-21. ఇక్కడ భావం ఇది. మూడు కుంచాల పిండి మొదటలో కొద్ది పరిమాణంలో కన్పిస్తుంది. అది పలిపిడి ద్రవ్యంతో కలిసి పులియబారినప్పడు చాల పెద్దదౌతుంది. అలాగే దైవరాజ్యం క్రీస్తు ప్రారంభించినప్పుడు చిన్నదే. కాని అతని మరణోత్తానాల తర్వాత అది ప్రపంచమంతా వ్యాపిస్తుంది. యూదులూ అన్యజాతివాళ్లు కూడ దానినో చేరతారు. కనుక పెరుగుదల ఇక్కడ ముఖ్యాంశం.

ఇక, ఈ పెరుగుదలకు కారకుడు యావే ప్రభువే, దైవరాజ్యం అతనిరాజ్యమే. కనుక ఈ సామెత దేవుణ్ణి గూర్చే స్త్రీ పిండిని పొంగ జేసినట్లే దేవుడు దైవరాజ్యాన్ని వ్యాప్తిచేస్తాడు. ఈ దేవుణ్ణి క్రీస్తు రొట్టెలు తయారుచేసే స్త్రీతో పోల్చింది. ఈ దేవునిపట్ల, అతడు వ్యాప్తిచేయబోయే దైవరాజ్యం పట్ల క్రీస్తుకి పూర్ణవిశ్వాసం ఉంది.

ఇక్కడకూడ క్రీస్తు యావే ప్రభువుని ఓ సామాన్య స్త్రీతో పోల్చాడు. అనగా దేవుణ్ణి పురుషుణ్ణిగా భావించినట్లే స్త్రీనిగా గూడ భావించవచ్చునని భావం.

3. తల్లిగా క్రీస్తు

యెరూషలేముకి వినాశం దాపురించింది. రోమీయులు ఆ నగరాన్ని నాశం చేయబోతున్నారు. ఇది యూదులకు దైవశిక్ష ఈ శిక్షకు గురికాకముందే వాళ్ళు క్రీస్తు