పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోధలను అంగీకరించి పశ్చాత్తాపపడితే మంచిది. తండ్రి వారిని క్షమించి కాపాడతాడు. ఈ సందర్భంలో క్రీస్తు చెప్పిన వాక్యం ఇది. "ఓ యెరుషలేమూ! కోడి రెక్కలను చాపి తన పిల్లలను కాపాడుకొన్నట్లే, నేను కూడ ఎన్నో పర్యాయాలు నీ బిడ్డలను చేరదీయగోరాను. కాని నీవు అంగీకరించలేదు" - లూకా 13,34. క్రీస్తు యెరూషలేమును కాపాడగోరుతుంటే ఆనగరం అతన్ని చంపగోరుతూంది. ఇది విడూరం. ఇక్కడ క్రీస్తు తన్ను తల్లికోడితో పోల్చుకొన్నాడు. యూద ప్రజలే ఆ కోడికి పిల్లలు. ఈ ఉపమానం పూర్వవేదంనుండి వచ్చిందే. ద్వితీ 32,11-12 భగవంతుణ్ణి తల్లిపక్షితో పోల్చింది. యెషయాకూడ ఈ పోలికను వాడాడు - 31,25. “పక్షి తన పిల్లలమీద రెక్కలువిప్ప వాటిని కాపాడినట్లే సర్వశక్తిమంతుజ్జయిన నేను యెరూషలేమును కాపాడతాను. దానిని శత్రువులకు చిక్కకుండ రక్షించి భద్రంగా ఉంచుతాను."

పూర్వవేదంలో యావే తల్లిపక్షి లాంటివాడు ఐనట్లే క్రీస్తుకూడ మనకు తల్లిపక్షి లాంటివాడు ఔతాడు. అనగా తల్లిపక్షి శత్రుపక్షుల నుండి తన పిల్లలను కాపాడుకొన్నట్లే క్రీస్తు మనలను ప్రేమతో కాచికాపడతాడని భావం. ఈలా కాపాడ్డమే అతడు మనకు దయచేసే రక్షణం. కాని యూదులు మూరులై ఆ రక్షణాన్ని నిరాకరించారు. నేడు మనంమాత్రం ప్రభువనే తల్లిపక్షి దయనూ ఆదరణనూ రక్షణాన్నీ అంగీకరించాలి.

ఇక్కడ పూర్వవేద సంప్రదాయాన్ని అనుసరించి క్రీస్తు తన్నుతాను తల్లితో పోల్చుకొన్నాడు. తర్వాత చాలమంది భక్తులు క్రీస్తుని తల్లిగా భావించి ప్రార్థన చేసికొన్నారు. వారిలో ప్రముఖురాలు 14వ శతాబ్దానికి చెందిన భక్తురాలు నోర్విచ్ జూల్యానా. ఈమె క్రీస్తుని "అమ్మా" అని సంబోధించేది.

4. తల్లిగా పవిత్రాత్మ:

క్రీస్తు నికొదేమతో మాట్లాడుతూ "నరుడు నీటివలన ఆత్మవలన జన్మిస్తేనేతప్ప దైవరాజ్యంలో ప్రవేశించడు" అని వాకొన్నాడు - యోహా 3, 3-6. మనం మొదట మన తల్లినుండి శారీరకంగా పడతాం. ఆటుపిమ్మట జ్ఞానస్నానం ద్వారా ఆధ్యాత్మికంగా పడతాం. ఈ రెండవ పుట్టుకవల్లనే మనం మోక్షాన్ని పొందగలిగేది. ఇక, మనకు ఈ రెండవ పుట్టుకనిచ్చే తల్లి పవిత్రాత్మే ఆత్మహీబ్రూ భాషలో స్త్రీలింగం. కనుక శారీరకమైన తల్లిలాగే వరప్రసాద రూపిణియైన తల్లికూడ ఉంది. ఈ రెండవతర్లే పవిత్రాత్మ ప్రాచీన క్రైస్తవులు ఆత్మను తల్లినిగానే భావించారు.

ఈలా బైబులు తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ అనే ముగ్గురు వ్యక్తులకు స్త్రీత్వాన్ని మాతృత్వాన్ని ఆరోపిస్తుంది. కట్టకడన ఈ క్రింది అంశాలను జాగ్రత్తగా గమనిద్దాం.