పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. క్రీస్తు బోధల ప్రకారం జీవించినంత మాత్రాన్నే అన్ని కష్టాలు తొలగిపోవు. ఈ సామెతలో రెండు యిండూ వరదకూ పెనుగాలికీ గురయ్యాయి కదా! ఐనా రాతిపై నిల్చిన యిల్ల పడలేదు. మన పునాదిరాయి క్రీస్తు — యెష26, 4 అతని మిూద నిల్చినవాడు కష్టనష్టాలకు తట్టుకొని నిలుస్తాడు. ఎంతటి శ్రమలైనా సరే అతన్ని క్రుంగదీయలేవు. అతని విూద నిలువనివాడు కుప్పకూలిపోతాడు.

8. ఇద్దరు కుమారులు 21, 28–32

1. క్రీస్తు ఈ సామెత చెప్పినపుడు అతని భావం ఇది. పెద్ద కుమారుడు మొదట తండ్రి ఆజ్ఞ వినలేదు. తర్వాత విన్నాడు. అలాగే సుంకరులూ, వేశ్యలూ మొదట దేవుని మాట వినలేదు. కాని తర్వాత క్రీస్తు పశ్చాత్తాప బోధ విని దేవునికి విధేయులయ్యారు. చిన్న కుమారుడు మొదట తండ్రి మాట విన్నట్లే కన్పించి తర్వాత మిూరాడు. అలాగే యూదనాయకులు మొదట దేవునికి విధేయులైనట్లే నటించి తర్వాత క్రీస్తు పశ్చాత్తాప బోధను నిరాకరించారు. ఇక, మత్తయి ఈ సామెతను లిఖించినపుడు క్రీస్తు పేరుకి బదులుగా స్నాపక యోహాను పేరు చేర్చాడు.

2. చిన్నపిల్లలు మొదట తల్లిదండ్రుల మాట వినరు. తర్వాత అనిష్టంగా వింటారు. పెద్దవాళ్ళమైన మనలో కూడ ఈ మనస్తత్వం వుంటుంది. నియమాలు అనగానే ఎదురు తిరుగుతాం. దేవుని ఆజ్ఞలు కూడ విూరుతాం. మన అహంకారమే దీనికి కారణం, ఆదాము సంతతికి దేవుని ఆజ్ఞలు పాటించటం కష్టంగా వుంటుంది.

3. చిన్న కుమారుడు తండ్రి మాట విన్నట్లే నటించి తర్వాత విూరాడు. ఈ వాలకం మనలో గూడ వుంటుంది. కనుక మనం గుడికి వెత్తాం, బైబులు చదువుతాం. జపదండ చెప్తాం. కాని మనం చేసే కుంభకోణాలు చేస్తూనే వుంటాం. పెద్దపెద్ద పాపాలకు వాడిగడతాం. కనుక మన కపటాన్ని గుర్తించి పశ్చాత్తాపపడదాం.

4. ఈ కథలోని ఇద్దరు కుమారులు ఒకటి చెప్పి మరొకటి చేసేవాళ్ళ మొదటి వానిలో అమర్యాద వుంది. రెండవవాడు కపటాత్మడు. ఇద్దరూ తండ్రికి మనస్తాపం కలిగించారు. కాని దేవుని కుమారుడైన క్రీస్తు తండ్రికి పరిపూర్ణంగా లొంగినవాడు. అతడెప్పడూ ఔననేవాడేగాని కాదనేవాడు కాదు- 2 కొరి 1,19, మనం గూడ క్రీస్తు లాగే మాటల్లోను చేతల్లోను దేవునికి విధేయులం గావాలి.

5. క్రైస్తవ మతానికి మొదటి నుండి "మార్గం" అని పేరు- అ.చ.9,2. మనం 89 మార్గంలో నడవాలి, అనగా మనకు ఆచరణం ముక్యం. క్రీస్తు ఆజ్ఞలు పాటించేవాడే క్రైస్తవుడు.