పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. నాస్తికులు కొన్ని కారణాల వల్ల దేవుణ్ణి నిరాకరిస్తారు. కాని స్వార్గాన్ని వదలుకొని పేదసాదలకు సేవలు చేస్తారు. వీళ్ళ బయటికి భక్తిమంతుల్లా కన్పించే వాళ్ళకంటె దేవునికి ఎక్కువ ప్రీతి కలిగించవచ్చు.

7. సుంకరులు, పాపులు పరిసయుల కంటె ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎందుకు? వారిలో కపటం లేదు. నిజాయితీతో తాము పాపులమని వొప్పకొన్నారు. అలాగే ఈనాడు కొందరు మతాధికారుల కంటె ముందుగా పాపులు దైవరాజ్యంలో ప్రవేశిస్తే ఆశ్చర్యపడనక్కర లేదు.

9. దొంగ 24, 43-44

1. ఇంటి యజమానుడు దొంగ వస్తాడని తెలిస్తే రాత్రంతా మేల్కొని వుంటాడు. దొంగ ఏ గంటలో వస్తాడో అతనికి తెలియదు కదా! అలాగే క్రైస్తవ భక్తుడు మనుష్య కుమారుని రాకకు ఎప్పుడూ సిద్ధంగా వుండాలి. అతడు వస్తాడని మనకు రూఢిగా తెలుసుగాని, ఎప్పడు వస్తాడో తెలియదు కదా!

2. ప్రాచీన కాలంలో మహా సముద్రాల్లో ప్రయాణం జేసే వోడల్లో ఒకడెప్పడూ దూరాన వుండే నేలవైపు చూస్తుండేవాడు, నేల కన్పించగానే నావికులకు తెలియజేసేవాడు. మన జీవిత నావ ఎప్పడూ పరలోకం వైపు ప్రయాణం చేస్తుంటుంది. ఈ జీవిత యాత్రలో మన మెప్పడూ ఆశాభావంతో ఆ దివ్యలోకం వైపు చూస్తుండాలి.

3. మనుష్య కుమారుడు దొంగలాగ తలవని తలంపుగా రెండవమారు వేంచేసి వస్తాడు. అతడు న్యాయాధిపతిగా వచ్చి మనకు శిక్లో బహుమానమో విధిస్తాడు. ఈ యంశం మనకు భయాన్ని కలిగించవచ్చు. కాని మనం ఆజ్ఞలు పాటిస్తూ భక్తిగా జీవిస్తే ఆ న్యాయాధిపతి రాకకు దడియనక్కరలేదు.

4. మామూలుగా ప్రభువు లోకాంతంలో దిడీలున వస్తాడు అనుకొంటాం. కాని మన మరణమే మనకు లోకాంతమౌతుంది. ఈ లోకంలో ప్రయాణం, ఇల్లు మారడం, పెండ్లి, ఉద్యోగ విరమణం మొదలైన కార్యాలకు జాగ్రత్తగా సిద్ధమౌతాం. కాని మరణమనే మహాకార్యానికి ముందుగానే సిద్ధమయ్యేవాళ్లు ఎంతమంది?

5. ప్రకృతి బీభత్సాలు, యుద్దాలు, కరువుకాటకాలు, ప్రమాదాల వల్ల కలిగే చావులు మొదలైనవన్నీ ఈ లోకం అనిత్యమని చాటిచెప్తంటాయి. మనం లోక వ్యామోహాన్ని విడనాడి మనసు పరలోకం వైపు త్రిప్పుకోవడానికి ఈలాంటి సంవుటనలు ఉపయోగపడతాయి.

10. క్షమింపనొల్లని సేవకుడు 1821– 35

1. రాజు మొదటి సేవకునికి పెద్ద అప్ప మన్నించాడు. కాని అతడు తోడి సేవకునికి చిన్న అప్పు మన్నించినందున రాజు అతన్ని కఠినంగా శిక్షించాడు. మనం తోడి వారి అపరాధాలను మన్నించకపోతే దేవుడు మనలను కూడ ఈలాగే శిక్షిస్తాడు.