పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం - 5

1. పదిమంది కన్నెలు అనే సామెతలో మొదట క్రీస్తు ఉద్దేశించిన భావమూ, తరువాత మత్తయి ప్రవేశపెట్టిన భావమూ, ఈనాడు ఆ సామెతను వాడుకొనే మనకు అన్వయించే భావమూ తెలియజేయండి.

2. ముగ్గురు సేవకులు అనే సామెతను ఒక విద్యార్థి సమాజానికో లేక ఉపదేశుల సమాజానికో అన్వయించేలా వివరించి చెప్పండి.

3. గోదుమలు కలుపు అనే సామెతను తీసికొని మనం పాపాత్ములపట్ల సహనం చూపాలి అనే భావాన్ని ఏలా బోధిస్తావో చెప్పు.

4.శవం ఉన్న కాడ రాబందులు చేరతాయి అనే ఉపమానవాక్యం భావం ఏమిటి?

అధ్యాయం - 6,7,8

1. క్రొత్త బట్టలూ క్రొత్త ద్రాక్షసారాయం అనే ఉపమాన వాక్యాల అర్థం ఏమిటి?

2. పిశాచం ఆకాశం నుండి మెరుపులా పద్ధం నేను చూచాను అనడంలో క్రీస్తు భావం ఏమిటి?

3. తన కోశాగారం నుండి ప్రాత వస్తువులనూ క్రొత్త వస్తువులనూ వెలికి తెచ్చిన యింటి యజమానునికీ క్రీస్తకీ ఏమి పోలిక?

4. చిన్నబిడ్డను శిష్యులమధ్య నిల్పి మిూరు ఈ బిడ్డలాగా తయారు కావాలి అనడంలో క్రీస్తు ఉద్దేశం ఏమిటి?

5. అంజూరపు చెట్టును శపించడంలో క్రీస్తు ఉద్దేశమేమిటి? నూత్నవేదంలో అంజూరాన్ని గూర్చిన సామెతలు మొత్తం ఎన్ని?

6. నక్కలకు బొరియలూ ఆకాశపక్షులకు గూళ్లు ఉన్నాయి కాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనే తావైనా లేదు అంటే యేమిటి? 7. పచ్చిమానికే ఈలా జరిగితే ఎండుమ్రానికి ఇంకా యేమి జరుగదు అనే వాక్యం భావం ఏమిటి?

అధ్యాయం - 9

సాధారణ ప్రశ్నలు

1. మి అనుభవం ప్రకారం మన ప్రజలకు సామెతలూ వాటి అర్థమూ ఎంతవరకు తెలుసు?

2. వ్యక్తిగతంగా నీకు అధికంగా నచ్చిన సామెతలు ఏవేవి? ఎందుకు?

3. క్రీస్తు సామెతలకు మన దేశంలో విన్పించే ఏ వర్గం కథలతో నైనా పోలిక ఉందా?

4.నీతికథకూ, నీతిపద్యానికీ, ఈ సామెతలకూ తేడా ఏమిటి? వీటన్నిటిలోను ప్రోతల మనసును ఆకట్టుకొనే గుణం ఏమిటి?

5.కథల ద్వారా బోధచేసిన క్రీస్తుని చూచి ఈనాడు మనం మన బోధలను ఏలా మలచుకోవాలి?