పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. న్యాయాధిపతి వితంతువు అనే సోమెత దేవుడు ఆధార్మికుడైన న్యాయాధిపతి లాంటివాడు అని చెప్తుందా?

5. “తండ్రీ కుమారుడు అనే సామెతలో బైబుల్లోని సారమంతా యిమిడి ఉంది" - ఏలాగ?

6. మేకలు గొర్రెలు అనే సామెతద్వారా క్రీస్తు తోడి జనంలో నెలకొని వుంటాడు అనే భావాన్ని ఏలా బోధిస్తావు?

7.శిష్యులకు కన్ను, ఉప్పు, దీపం, కొండమీది నగరం ఉపమానాలు - ఏలాగ?

అధ్యాయం -3

1. మొదట కొంచెము కడపట ఘనం అనే భావం ఆవగింజ సామెతకు ఏలా వర్తిస్తుంది?

2. విత్తేవాడు అనే సామెతలో మొదట క్రీస్తు ఉద్దేశించిన భావం ఏమిటి? తర్వాత ప్రచారంలోకి వచ్చిన భావం ఏమిటి?

3. దానంతట అదే పండిన పంట అనే సామెతలో క్రీస్తు ఆనాటి ఉత్సాహవాదుల భావాలను అంగీకరించాడా?

4. బైబులు అన్న పొలంలో దాగివున్న నిధి క్రీస్తు అనే జెరోము భావాన్ని ఏ సామెత ద్వారా, ఏ విధంగా బోధిస్తావు?

5. దైవరాజ్యపు సామెతలను ఆధారంగా తీసికొని హైస్కూలు విద్యార్థులకు దేవుని రాజ్యం మన హృదయంలోనే ఏలా నెలకొని ఉంటుందో వివరించి చెప్పండి.

అధ్యాయం - 4

1. వివాహవస్త్రంలేని అతిథి అనే సామెతలో మొదట క్రీస్తు ఉద్దేశించిన భావం ఏమిటి? తర్వాత ఆ సామెతను లిఖించిన మత్తయి ఉద్దేశించిన భావం ఏమిటి?

2. భూస్వామి కౌలుదార్లు అనే సామెత క్రీస్తుకి యూదనాయకులకీ ఏలా వర్తిస్తుంది?

3. యజమానుడు యుక్తిగల గృహనిర్వాహకుణ్ణి మెచ్చుకొంది అతనిలోని ఏ గుణాన్ని చూచి?

4.అవివేకియైన ధనికుడు అనే సామెతను తీసికొని "మనమందరమూ కొద్దిగానో గొప్పగానో నాస్తికులమే" అనే భావాన్ని నగరవాసులకు ఏలా బోధిస్తావు?

5. "ధనవంతుడు లాజరు అనే సామెతను ఆరురు ధనిక సోదరులు అని పిలవడం మేలు" - ఎందుకు ?

6. కాపపట్టని అంజూరం అనే సామెత సహాయంతో నరుడు పరివర్తనం చెందాలి అనే భావాన్ని ఏలా బోధిస్తావు?

7. త్వరపడాలి అనే సామెతల్లో మనం దేనికొరకు త్వరపడాలి? ఎందుకు త్వరపడాలి?