పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ సామెత భావం అదికాదు. యజమానుడు మెచ్చుకొంది నిర్వాహకుని యుక్తినిగాని అతని మోసాన్ని కాదు. ఇక్కడ నిర్వాహకుడు అపాయస్థితిలో ఉన్నాడు. అతని ఉద్యోగం ఊడిపోబోతూంది. అలాంటి పరిస్థితుల్లో అతడు చేతులు నలుపుకొంటూ, గోళ్ళు గిల్లకొంటూ కూర్చున్నట్లయితే నాశమై పోయేవాడే. కాని అతడు వెంటనే కార్యాచరణకు పూనుకొన్నాడు. యుక్తితో ప్రవర్తించి కొంతమంది మన్నన సంపాదించు కొన్నాడు, దానితో బ్రతికిపోయాడు. అలాగే క్రీస్తు బోధను ఆలించే యూదనాయకులు గూడ దైవరాజ్యంలో చేరకుండా వొట్టినే జాప్యంచేస్తూ వుండిపోగూడదు. వాళ్ళగూడ యుక్తితో ప్రవర్తించాలి, శీఘమే కార్యాచరణకు పూనుకోవాలి. దైవరాజ్యంలో చేరతామని నిర్ణయం చేసికోవాలి. లేకపోతే అనతికాలంలోనే నాశమైపోతారు— ఇది ఈ సామెతలో క్రీస్తు ఉద్దేశించిన భావం.

లూకా ఈ సామెతను సువార్తల్లో లిఖించేప్పటికల్లా దీని భావం కొంచెం మారింది. క్రైస్తవులు కొందరు డబ్బు కూడబెట్టుకొంటున్నారు. కాని వాళ్ళ ఆ డబ్బును సత్కార్యాలకూ దానధర్మాలకూ వినియోగించాలి. ఆ సత్కార్యాల ద్వారా వాళ్ళ మోక్షరాజ్యం చేరతారు. ద్రవ్యం చెడ్డదే ఐనా దాన్ని సత్కార్యాలకు వినియోగించినపుడు స్వర్గంలోని దేవదూతలే స్నేహితులై మనకు మోక్షప్రాప్తి కలిగిస్తారు— ఇది లూకా సూచించిన భావం - 16,9. ఈలా యూదనాయకులు శీఘమే కార్యాచరణకు పూనుకోవాలి అని దీని తొలి భావం. క్రైస్తవులు తమ ధనాన్ని దానధర్మాలకు వెచ్చించాలి అని దీని రెండవ భావం.

3. అన్వయం

మన జీవితంలో చేసికోవలసిన నిర్ణయాలు త్వరగా చేసికోం. జాప్యం చేస్తూంటాం. దీనివల్ల పెద్ద అనర్గాలు కలుగుతూంటాయి. మనం భక్తితో ఓ వడకాన్ని చేసినపుడో ఓ ప్రసంగాన్ని విన్నపుడో జీవితంలోని ఆయా అంశాలను సవరించుకోవాలి అనిపిస్తుంది. కాని వాటిని సవరించుకోకుండా ఆలాగే జాప్యం చేస్తాం. ఇది మంచిపద్ధతి కాదు. ఈ సామెతలోని గృహనిర్వాహకుళ్లాగే మనం కూడ యుక్తితో త్వరగా సత్కార్య నిర్వహణకు పూనుకోవాలి.

షరా : క్రీస్తు సామెతల్లోకల్ల ఇది కష్టమైన సామెత అని చాలమంది అభిప్రాయం. ఆ గృహనిర్వాహకుని మోసాన్ని మనమేలా అనుకరించగలమా అనేది దీనిలోని చిక్కు కాని క్రీస్తు మనలను అనుకరించమంది ఆ నిర్వాహకుని మోసాన్నిగ్రాదు. అతని యుక్తినీ సత్వర కార్యాచరణాన్నీనీ. ఈ యర్గాన్ని తీసికొంటే దీనిలోని క్లిష్ణార్ధం తొలగిపోతుంది.

5. అవివేకియైన ధనికుడు - లూకా 12, 13–21

1. సందర్భం

ఓ కుటుంబంలోని అన్నదమ్ములు తండ్రి ఆస్తి విషయమై పోట్లాడుకొన్నారు. 'తమ్ముడు క్రీస్తుని రాజీ కుదర్చమని కోరాడు. క్రీస్తు వాళ్ళ ఆస్తిపాస్తుల విషయంలో జోక్యం గలిగించుకోవడానికి నిరాకరించి ఈ క్రింది సామెతను చెప్పాడు.