పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. భూస్వామి, కౌలుదార్లు — లూకా 20, 9–19.

1. సందర్భం

యూదనాయకులు, విశేషంగా సానేడ్రిన్ మహాసభ సభ్యులు, క్రీస్తు అధికారాన్ని సవాలు చేసారు. ప్రభువు ఆ నాయకుల నుద్దేశించి ఈ సామెత చెప్పాడు.

2. వివరణం

ఆ రోజుల్లో పాలస్తీనా దేశంలో కొందరు సంపన్నులు తమ పొలాన్ని సేద్యగాళ్ళకు గుత్తకిచ్చి తాము రోము మొదలైన విదేశ నగరాల్లో సుఖంగా కాలక్షేపం చేస్తుండేవాళ్ళు ఈ కథలోని భూస్వామికూడ అలాంటివాడే ననుకోవాలి. అతడు తన ద్రాక్షతోటను గుత్తదారుల వశంలోవుంచి తానెక్కడో దూరదేశాల్లో వసిస్తూన్నాడు. ఆ యజమానుడు తన గుత్తదారుల నుండి కౌలు రాబట్టడానికి మూడుసార్లు సేవకులను పంపాడుగాని ఆ దుష్టులు సొమ్ము చెల్లింపలేదు. పైగా సేవకులను కొట్టి పంపారు. యజమానుడు విసిగిపోయి కడన సాంత కుమారుట్టే పంపాడు, గుత్తదారులు అతనికైనా భయపడతారేమో ననుకొన్నాడు. కాని ఆ దుషులు ఆ కుమారుడ్డి పట్టుకొని చంపివేసారు. ఆ తోటకు వారసు కుమారుడే కనుక అతని ప్రాణంతీస్తే ఆ తోట తమకే దక్కుతుంది అని వాళ్ల భావం. భూస్వామి గతించినపుడు సేద్యగాళ్ళే అతని పొలాన్ని ఆక్రమించుకోవడం కద్దు.

3. భావం

పూర్వవేదం యిస్రాయేలు ప్రజను ద్రాక్షతోటతో ఉపమిస్తుంది. యెషయా ప్రవచనం 5, 1-7లో ఈ ఉపమానం విపులంగా కన్పిస్తుంది. “సర్వశక్తిమంతుడైన ప్రభువునకు ఇష్టమైన ద్రాక్షతోట యిప్రాయేలు ప్రజ" అంటాడు ప్రవక్త- 5,7. కనుక ఇక్కడ ద్రాక్షతోట అంటే యిస్రాయేలీయులే. ఆ ద్రాక్షతోట కాపులు యిస్రాయేలు నాయకులను సూచిస్తారు. తోట అధిపతి పరలోకంలోని తండ్రి. అతడు పంపిన సేవకులు ప్రవక్తలు. యిప్రాయేలు నాయకులు ప్రవక్తల బోధలను ఆలించలేదుగదా, వాళ్ళను హింసించారు. కడన యజమానుడు తన కుమారుణ్ణి పంపాడు అంటే, యిప్రాయేలు ప్రజలకు బోధించడానికి తండ్రి కడన కుమారుట్టే పంపాడు అని అర్థం. ఈ కుమారుట్టే యూదులు యెరూషలేము వెలుపల సిలువవేసి చంపుతారు. కాని యూదులు నిరాకరించిన రాయే తర్వాత క్రైస్తవ సమాజమనే భవనానికి మూలరాయి ఔతుంది.

ఈలా ఈ సామెత క్రీస్తు జీవితానికీ మరణానికీ వర్తిస్తుంది. ఈ సంగతిని అతని శత్రువులు కూడ గ్రహించారు. గ్రహించి అతన్ని అక్కడే పట్టి చంపబోయారు - 20, 19. ఇక్కడ క్రీస్తు తన్నుదేవుని కుమారుడ్డిగా వర్ణించుకొన్నాడు. యూదనాయకులను దుష్టులైన కౌలుదార్లనుగా చిత్రించాడు. కనుక వాళ్ళకు అతనిమీద పట్టరాని కోపం వచ్చింది.