పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమెను నీచంగా జూచేవాళ్ళు స్త్రీకి వ్యక్తిగా విలువలేదు. మగబిడ్డలను కనినదానినిబట్టీ, కాయకష్టం చేసినదానినిబట్టీ ఆమెకు విలువ వుంటుంది, అంతే. ఐనా యూదులు బిడ్డల తల్లిని గౌరవించేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో భార్యలు భర్తలకు గౌరవం తెచ్చిపెట్టారు. దెబోరా, యూదితు మొదలైనవాళ్లు ఈలాంటివాళ్లు, యూదమహిళలకు గౌరవమిచ్చేది మాతృత్వం, కన్యాత్వం, వంధ్యాత్వం శాపాలు.

మొదటలో యూదులు ఏకపత్నీవ్రతులే. కాని కాలక్రమేణ బహుభార్యాత్వం వ్యాప్తిలోకి వచ్చింది. కనుక సంపన్నులైన పురుషులకు సొంత భార్యలతోపాటు ఉపపత్నులు కూడ వుండేవాళ్లు, వీళ్లు ఉంపుడుగత్తెలుకాదు, నిజమైన భార్యలే. కాని వీళ్ల బిడ్డలకు వారసపహక్కువుండదు.

భార్య వ్యభిచారం భర్త హక్కులను భంగపరుస్తుంది. కనుక అతడు ఈ నేరం కారణంగా ఆమెకు విడాకులీయవచ్చు. ఈ సందర్భంలో అతడు విడాకుల చీటినిచ్చి ఆమెను ఇంటినుండి పంపివేయవచ్చు. భర్త వ్యభిచారం భార్య హక్కులను భంగపరచదు. అసలు ఆమెకు హక్కులనేవి వుంటేగదా! పురుషుడు కన్యతో వ్యభిచరిస్తే అది నేరం కాదు. ఎందుకంటే ఆమెకు భర్తలేడు కనుక పురుషుని హక్కుల కేభంగం కలుగదు. మగవాళ్లేగాని ఆడవాళ్ల విడాకులు ఇచ్చేవాళ్లుకాదు.

విధవలు పెద్దకుమారుని పోషణంలో వుండేవాళ్ళ పెద్దకొడుకు పట్టించుకోకపోతే సమాజం, దుష్టులైన న్యాయాధిపతులు కూడ వాళ్ళను దోచుకొనేవాళ్ళు.

ఐనా యూదస్త్రీలకు కొoత స్వేచ్ఛ లేకపోలేదు. వాళ్ళు పర్గా లేకుండానే యిరుగుపొరుగు ఇండ్లకు వెళ్ళవచ్చు. స్వేచ్చగా పొలం పనికి పోవచ్చు. పండుగల్లో పాటలు పాడవచ్చు, నాట్యం చేయవచ్చు. దేవాలయంలో కానుకలు అర్పించవచ్చు. నైవేద్యాలు ఆరగించవచ్చు. కాని భర్త అనుమతి లేనిదే భార్య ఏ వ్రతాలు చేపట్టకూడదు. బాబిలోనియా ప్రవాసానంతరం యూద స్త్రీలు ఇల్లు విడిచి బయటికి పోయినపుడెల్ల పర్షా ధరించవలసివచ్చేది.

ఈ కాలంలో వ్రాసినవే విజ్ఞాన గ్రంథాలు, ఈ పుస్తకాలు వ్రాసిన రచయితలకు స్త్రీలపట్ల సద్భావంలేదు. వీళ్లు పురుషులను చెడగొట్టేవాళ్ళనుగా స్త్రీలను వర్ణించారు. కనుక యువకులు స్త్రీల వలల్లో చిక్కుకోగూడదని పదేపదే హెచ్చరిస్తుంటారు - సామె 6, 2335, 7,5–27. కొందరు ప్రవక్తలు కూడ ఇదే మార్గంలో పోయారు. ఉదాహరణకు, జెకర్యాదుష్టత్వమంతా స్త్రీలకే అంటగట్టాడు - 5, 5–7, మామూలుగా యూదపురుషులు స్త్రీలతో కలవడంగాని వాళ్ళతో మాట్లాడ్డంగాని దురాచారంగా భావించేవాళ్ళ బెన్ జొక్కయి