పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తావులో "ప్రభువు తన మందలను నీటిబుగ్గలయొద్దకు తోలుకొని పోతాడు. కనుక ఆకలిదప్పులు ఎండపొడలు ఆ గొర్రెలను బాధింపవు" అని చెప్పాడు. 49,10.

3. యావే కాపరి అన్నాంకదా! యిస్రాయేలు అతడు మేపేమంద, అందుకే కీర్తనకారుడు "ప్రభూ! నీ ప్రజలమూ నీ మందకుచెందిన గొర్రెలమూ ఐనమేము నీకు వందనాలు అర్పించి నిత్యమూ నిన్ను స్తుతిస్తూంటాం" అంటాడు - 79, 13. మరో కీర్తనకారుడు, “యావే ఒక్కడే దేవుడు సుమా! ఆయనే మనలను కలిగించాడు. మనము అతనికి చెందినవాళ్లం. ఆయన ప్రజలం, ఆయన మేపే మందలం" అని నుడివాడు - 100,3. ఈ యావే మందలను మేపడానికి తన సేవకులను నియమించాడు, కీర్తనకారుడు ఎడారికాలాన్ని స్మరించుకుంటూ "మోషే అహరోనులచే నీ ప్రజలను ఓమందలాగ నడిపించావు? అంటాడు - 77,20. మోషే చనిపోవకముందు ప్రభువు ప్రజలకు మరో కాపరిని ప్రసాదించాలని ప్రార్ధించాడు "ప్రభూ! నీవు సమస్త ప్రాణులకు దేవుడవు బ్రతికియున్న ప్రాణులన్నిటికీ జీవమిచ్చేవాడవు. ఈ ప్రజలు కాపరిలేని గొర్రెల్లాగ అలమటించకుండ వుండేందుకు వీళ్లకొక నాయకుని ప్రసాదించు" అని మనవి చేసాడు. ఈ మనవి ఆలించి ప్రభు యిప్రాయేలీయులకు యోషువాను నాయకుని జేసాడు - సంఖ్యా 27, 17. ఇక యావే తన మందమీద నియమించిన సేవకులలో దావీదు చాలగొప్పవాడు. అందుకే కీర్తనకారుడు “అతడు తన సేవకుడైన దావీదు నెన్నుకున్నాడు. గొర్రెలమందనుండి, గొర్రెపిల్లల చెంతనుండి, అతనిని పిలిపించి యిస్రాయేలీయులకు రాజను చేసాడు. దేవుని ప్రజలకు అతనిని కాపరిగా నియమించాడు" అంటాడు - 78,70.

4. కాని రానురాను యావే నియమించిన యీ కాపరులు ఆ యోగ్యులైపోయారు. మందలను మేపడానికి మారుగా ఆ మందలను బ్రింగివేయటం మొదలెట్టారు, అందుకే ప్రభువు ప్రవక్త యెహెజ్కేలు ద్వారా "కాపరులు గొర్రెలను మేపాలి. కాని వాళ్లు పోతరించిన గొర్రెలను వధించి క్రొవ్వును భుజించి, వాని ఉన్నిని కప్పకుంటున్నారు. గాని గొర్రెలను మాత్రం మేపడం లేదు" అని అధిక్షేపిస్తాడు - 34, 3. కాపరుల అశ్రద్ధ వలన గొర్రెల మందలు చెదరిపోతాయి — యిర్మి 23, 1-3. కనుక ప్రభువే వాటికి కాపరి ఔతాడు. వాటిని పచ్చిక బయళ్లకు తోలుకొని పోతాడు - యిర్మీ 50,19. ఆ మందను తన చెంత నుంచుకొని కాచి కాపాడతాడు - యిర్మీ 31,10, గొర్రెల పట్ల ప్రభువు చూపే యీజాగ్రత్త మెచ్పుకోతగ్గది గదా!

5. యావే తన పేరుమీదగా ఓ మంచి కాపరిని పంపిస్తాడు. అతనికి క్రొత్తగా దావీదు అని పేరు. ప్రభువు యిర్మీయా మఖాన "నాకు నచ్చిన కాపరిని మీ మీద