పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19వ శతాబ్దిలో జీవించిన "ఇప్పవేర్" అనే యిూజిప్టరాజును గూర్చి ఓ శాసనం "ఈరాజు జనులకు కాపరి. ఇతడు కల్లకపటాలు లేనివాడు. ఇతని మందలు కొద్దిపాటివి. ఐనా దీనమంతా ఇతడు వాటికోసం జాగ్రత్తపడుతుండేవాడు" అని వాకొంటుంది. ఇలాంటివాతావరణానికి చెందిన యిస్రాయేలు ప్రజలుకూడ తమ దేవుణ్ణి కాపరిగా భావించడంలో వింతేలేదుకదా! ప్రాచీన హీబ్రూప్రజలు గొర్రెల కాపరులు. బహు ప్రాచీన కాలంలోనే ఆ జంతువును మచ్చిక చేసారు. వాళ్లు స్థిరనివాసమంటూ లేకుండా ఎప్పడూ అటూయిటూ తిరుగాడుతుండేవాళ్లు, గొర్రెలమందలనుకూడ తమతో తోలుకొని పోతుండేవాళ్లు. హేబెలు గొర్రెలకాపరి - ఆది 4,2. యోసేపు సోదరులు ఫరోతో "దొరా! మా పితామహుల్లాగే మేమూ వృత్తిచే గొర్రెల కాపరులం" అంటారు - ఆది 47,3. హీబ్రూప్రజలకు గొర్రె బహువిధాలుగా ఉపయోగపడింది. వాళ్లు దానిమాంసాన్ని భుజించేవాళ్లు, పాలుత్రాగేవాళ్లు, ఉన్నిని బుట్టలకు గుడారాలకు వాడుకునేవాళ్లు, వ్యాపారంలో గొర్రెమారకపు ధనంగా ఉపయోగపడేది. ఎడారి కాలంలోనైతేనేమి, దేవాలయకాలంలోనైతేనేమి గొర్రెపోతు ప్రభువునకు సమర్పింపబడే బలిపశువుకూడ. పైగా గొర్రె సాధుజంతువు. కల్లకపటం లేకుండ విశ్వాసంతో, స్నేహభావంతో కాపరివెంట నడచిపోతుంటుంది. అతడు తన్ను కాపాడితేనేగాని బ్రతకలేని బలహీనపజంతువు. ఈ కారణం చేత గొర్రె యిస్రాయేలు ప్రజలకు అనురాగయోగ్యమైన జంతువయింది. కావున ప్రజలు తమ్ము గొర్రెలమందతో బోల్చుకున్నారు. తమ దేవుడైన యావేను కాపరితో బోల్చుకున్నారు. 2. యావే ప్రభువు కాపరిలాంటివాడు అన్నాం, "ప్రభువే నాకు కాపరి, నాకిక యేకొదవలేదు" అంటుంది కీర్తన 23,1, మంచి కాపరి దొరకిన మందకు ముప్పలేదు కదా! “యావే మనదేవుడు, మనం ఆ ప్రభువు పాలించే ప్రజలం. ఆయన మేపే గొర్రెలం" అంటుంది కీర్తన 95,6. అనగా యెడారికాలంలో ప్రభువు యిస్రాయేలీయులను ఓగొర్రెల మందలాగ నడిపించుకొనివచ్చాడని భావం. అటుపిమ్మట యిప్రాయేలీయులు పాపంచేసి ప్రభువునకు కోపం కలిగించారు. ఆవుపెయ్యవలె మొండితనం జూపారు - హోపే 4,16. కనుక ప్రభుపు వాళ్లను బాబిలోనుకు ప్రవాసం పంపించాడు. కాని యూదులు బాబిలోను ప్రవాసంనుండి తిరిగి వచ్చేటప్పడు కూడ యావే కాపరిలాగే వ్యవహరించాడు. “యావే కాపరిలాగే తనమందను మేపుతాడు. గొర్రెపిల్లను చేతులలోనికి దీసికొని రొమ్ముమీద మోపకుంటాడు. తల్లిగొర్రెలను మెల్లగా అదిలించుకుంటూ వస్తాడు” అంటాడు ప్రవక్త యెషయా - 40,11. ఈ వాక్యంలో, గొర్రెపిల్లలపట్ల, తల్లిగొర్రెలపట్ల ప్రభువు చూపే ఆదరం గమనింపదగ్గది. అతడు మార్థవంతో మందను మేపేవాడు. ఆ ప్రవక్తి మరియొక