పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతడు తండ్రినుండే తన అనుదినాహారాన్ని పొందుతూ వచ్చాడు. కనుక "మాకు నేటికి కావలసిన అన్నం దయ చేయ" మని ప్రార్ధించాడు. క్రీస్తు శత్రువుల కొరకు ప్రార్థించాడు - లూకా 23, 34 కావున "మా యొద్ద అప్పపడిన వారిని” అని విన్నవింప గలిగాడు. ఆ ప్రభువు శిష్యులు శోధనలో ప్రవేశింపకుండా వుండాలని ప్రార్ధించాడు - లూకా 22, 32. తండ్రి మనలనందరినీ కాపాడాలని మనవి చేసాడు - యోహా 17,11. కనుక అతడు "మమ్మ శోధనలో ప్రవేశింపనీయక దుష్ణుని నుండి కాపాడు" అని అడిగాడు. ఈలాగ పరలోకజపం క్రీస్తు జపంకూడ. మనలాగే అతడూ పితను ఆరాధించినవాడు.

పరలోకజపం దైవరాజ్యాన్ని గూర్చి బోధిస్తుంది అన్నాం. క్రీస్తే ఆ రాజ్యం అనిచెప్పాం. మనమూ ఆ రాజ్యం కొరకు కనిపెట్టుకొని వుండాలి. ఆ రాజ్యం మన హృదయాల్లో నెలకొనాలని ఉవ్విళూరుతుండాలి.

3. క్రీస్తు విజ్ఞాపనం

హెబ్రీయుల జాబు ఉత్థానక్రీస్తు తండ్రి సమక్షంలో నిరంతరం జీవిస్తుంటాడనీ, తనద్వారా దేవునివద్దకు వచ్చేవాళ్లకొరకు విజ్ఞాపనంచేస్తూ వాళ్లను సంపూర్ణంగా రక్షిస్తుంటాడని చెప్తుంది - 7,25. ఆలాగే రోమీయుల జాబు కూడ ప్రభువు మృతులలోనుండి లేచి దేవుని కుడిపార్యాన నెలకొనివుండి మనకొరకు విజ్ఞాపనం చేస్తూంటాడని వాకొంటుంది - 8,34. ఈలా వుత్దాన క్రీస్తు మోక్షంలో తన తండ్రి సమక్షంలో మన తరపున ప్రార్ధింస్తూంటాడనేది చాలాగొప్ప సత్యం

యోహాను తొలిజాబు ఉత్దానక్రీస్తుని "ఆదరణకర్త" లేక "ఉత్తరవాది" అని పేర్కొంటుంది –2, 1. అనగా అతడు మన తరపున దేవునియెదుట వాదించేవాడు. మానవజాతి శత్రువైన పిశాచం మనమీద మోపే నేరానికి ప్రతిపక్షం చేసేవాడు. పిశాచాన్ని ఓడించి మనకు విజయం సాధించిపెట్టేవాడు. మన కోపు దీసికొనేవాడు. క్రీస్తు విజ్ఞాపనంలో ఈ భావాలన్నీ ఇమిడివున్నాయి. అతడు దేవుని యెదుట మనకొరకు, మనతరపున మనవి చేసేవాడు.

కాని ఉత్థానక్రీస్తు దేవుని యెదుట మనకోసం ఏలా మనవి చేస్తాడు? ప్రభువు తండ్రి యెదుట ఏమీ మాటలాడనక్కరలేదు. తండ్రి సమక్షంలో నిలవడమే అతని విజ్ఞాపనం. అతడు మన కోసం మానుషదేహాన్ని స్వీకరించాడు. ఆ దేహం ఇప్పడు ఉత్దానమైయుంది. ఆ వృత్దానదేహాన్ని క్రీస్తు తనతండ్రియెదుట ప్రదర్శిస్తాడు. ఆ ప్రదర్శనమే అతని విజ్ఞాపనమౌతుంది. పైగా ఆ ప్రభు హృదయంలో మనలను రక్షించాలనే కోరిక మిక్కుటంగా వుంటుంది. తండ్రికి ఆ కోరిక అర్థమౌతుందిగూడ, కనుక ఈ కోరికగూడ క్రీస్త విజ్ఞాపనమే.