పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలవర్చుకొనేలా చేయి. నా బాధలవలన ఇతరుల వేదనలను సానుభూతితో అర్థంజేసికొనే భాగ్యాన్ని కూడ దయచేయి.

నా ప్రభావానికి గురైనందున ఏ నరుడూ అధముడు గాకుండునుగాక, నాతో కలియడంవల్ల ఏ జనుడూ తన మంచితనాన్నీ శీలన్నీ ఔన్నత్యాన్నీ కోల్పోకుండునుగాక. నా ప్రభావానికి గురైనవాళ్లు మంచివైపేగాని చెడ్డవైపు మొగ్గకుందురుగాక, నేను లోకంలో చెడ్డకు గాక మంచికి కారకుణ్ణి అగుదునుగాక.

4. ఆరోగ్యవరానికి వందనాలు

ప్రభూ మేము నీవు మాకు దయచేసిన వరాలకు అలవాటు పడిపోతాం. వాటిని ಅట్టే విలువతో చూడం. కాని ఆ వరాలను పోగొట్టుకొన్నపుడు వాటి విలువను అర్థంజేసికొంటాం. నీవు మాకు దయచేసిన ఆరోగ్యవరం ఈలాంటిదే. ఆరోగ్యంగా వున్నంతకాలం మాకు దాని విలువ తెలియదు, వ్యాధి వచ్చినపుడు ఆరోగ్యం ఎంత గొప్పవరమో అర్థంజేసికొంటాం. నీవు నాకు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించావు. నా దేహమూ మనస్సూ కూడ బలంగా వున్నాయి, అన్ని అవయవాలు సంతృప్తికరంగా పనిజేస్తున్నాయి. ప్రశాంతంగా రోజులు సాగిస్తున్నాను. ఇందుకు నీకు వందనాలు చెప్తున్నాను. ప్రభూ! ఆరోగ్యంగా జీవిస్తున్న నాకు రోగులపట్ల సానుభూతిని దయచేయి. వ్యాధికి గురైనవారిని చిన్నచూపుచూచి చీదరించుకోకుండా వుండేలా చేయి. జబ్బుగా వున్నవాళ్ళను కాస్త పట్టించుకొని వాళ్ళకు నాకు చేతనైన సాయంచేసేలా అనుగ్రహించు. ఆరోగ్యమూ అనారోగ్యమూ రెండూ కూడ నీనుండి వచ్చే వరాలేనని గ్రహించే భాగ్యాన్ని కూడ దయచేయి.

5. నేను నిన్ను నమ్మి జీవిస్తాను

ప్రభూ! నేను నీకేదో ప్రత్యేక సేవచేయాలనే నీవు నన్ను సృజించావు. నీవు నాకు ఒప్పజెప్పిన పనిని మరొకరికి ఒప్పజెప్పలేదు. ఈ లోకకళ్యాణం కొరకు నీవు తయారుచేసిన రక్షణ ప్రణాళికలో నాకూ స్థానంవుంది. నేనీ లోకంలో ఏమి మంచిని సాధించాలని నన్ను పుట్టించావో నాకిప్పడు తెలియదు. కాని పరలోకంలో తెలుస్తుంది. ఐనా నేను ఇక్కడ సాధించవలసిన మంచియేదో వుంది. కనుక నిన్ను నమ్మి జీవిస్తాను. నాకు వ్యాధిసోకితే ఆ వ్యాధే నీ సేవకు ఉపయోగపడుతుంది. భయాందోళనలూ విచారమూ పీడిస్తే అవే నీ సేవకు ఉపయోగపడతాయి. నీవు నిరుపయోగంగా దేన్నీ చేయవు. నీవు చేసే పని నీకు బాగా తెలుసు. నీవు నా బంధుమిత్రులను తీసికొని పోవచ్చు. నన్ను పరాయి వాళ్ళమధ్య వదలివేయవచ్చు. లోకం నన్ను విస్మరించేలా చేయవచ్చు. నాకు నిరుత్సాహం