పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. వివిధ ప్రార్థనలు

బైబులు భాష్యం - 112

1. దైవచిత్తానికి లొంగాలి

ఓ ప్రభూ! నేను నీ చిత్తానికి లొంగివుండే భాగ్యాన్ని దయచేయి. నిన్ను నమ్మినవాళ్ళకు అన్ని సంఘటనలూ మంచినే చేకూర్చిపెడతాయని గ్రహించేలాచేయి. కష్టాలూ అపజయాలూ కూడ నన్ను నీ దగ్గరికి చేరుస్తాయి. నీవు నా శక్తిని మించిన పరీక్షకు నన్ను గురిచేయవని నాకు తెలుసు. ఏ తండ్రికూడ తన బిడ్డట్టి అనవసరంగా శ్రమలపాలు చేయడు. కనుక నీవు మా మంచినికోరే మమ్మ ఇక్కట్టులకు గురిచేస్తూంటావు. తండ్రీ! నన్ను నేను నీ చేతుల్లోకి అర్పించుకొంటున్నాను. నేను ఎల్ల వేళల నీ దివ్యచిత్తానికిలొంగి జీవించేలా అనుగ్రహించు.

2. సత్యప్రీతి

ప్రభూ! నాకు సత్యాన్ని తెలిసికోవాలనే తపనను దయచేయి. ఓమారు సత్యాన్ని గ్రహించాక ఇతరులు ఏమనుకొంటారో అని జంకక ఆ సత్యంవైపే మొగ్గలా చేయి. నష్టమైనా కష్టమైనా ఆ సత్యాన్ని అనుసరించిపోయేలాచేయి. సంపూర్ణ సత్యానివి నీవే కనుక సత్యప్రీతి కలవాడు నిన్ను చేరతాడని గ్రహించేలా చేయి. దురభిమానానికి లొంగికాని, తాత్కాలిక లాభాన్ని ఆసించికాని నిజాన్ని మరుగుపరచకుండా వుండేలాచేయి. నా జీవితకాలమంతా నీ సత్యదీపం నాకు దారిజూపుతూండునుగాక.

3. చెడ్డకుకాక మంచికి కారకుణ్ణి

ప్రభూ! నేను ప్రియాప్రియ సంఘటనల్లోను మృదువుగాను శాంతంగాను మెలిగేలా చేయి. ఇతరులు నా ఆశలను వమ్ముజేసినపుడూ, నన్ను వంచించినపుడూ, నాకు నమ్మకద్రోహం చేసినపుడూ నేను కోపతాపాలకు గురిగాకుండా వుండేలా చేయి. నన్ను నేను కాస్త మరచిపోయి ఇతరుల సౌఖ్యాన్ని గూర్చి ఆలోచించేలాచేయి. ఇతరులమీద సుమ్మర్లు పడకుండ నా బాధలను ఓర్పుతో సహించేలా చేయి. జీవితంలో నాకెదురయ్యే శ్రమలవల్ల లాభాన్ని పొందేలాచేయి. ఆ శ్రమలవల్ల " నేను అధముణ్ణిగా గాక ఉత్తముణ్ణిగా మారేలా చేయి. కష్టాలవల్ల కోపాన్ని గాక ఓర్పుని