పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాకూ దయచేయి
పూర్వం యిర్మీయా పాలకులు పెట్టే హింసలకు దడిసి
తన ప్రవచన సేవను విరమించుకోవాలనుకొన్నాడు
కాని నీ సందేశాన్ని వెల్లడిచేయాలనే త్రీవమైన కోరిక
ఆ ప్రవక్త హృదయంలో అగ్నిజ్వాలలాగ మండజోచ్చింది
అతడా మంటను భరించలేక
మల్లా ప్రవచనం చెప్పడానికి పూనుకొన్నాడు
పౌలుకూడ సువార్త ప్రకటనంపట్ల
తనకున్న అభిరక్తినిగూర్చి చేప్తూ
క్రీస్తునిగూర్చి బోధించినందులకు
నేను గొప్పలు చెప్పకోనక్కరలేదు
ఆ ప్రభువు రక్షణసందేశాన్ని బోధించే భారాన్ని నా నెత్తిన పెట్టాడు
సువిశేషసేవ చేయకపోతే నేను ముదనష్టమైపోతా నన్నాడు
ఈ మహానుభావులకు కలిగిన ప్రేరణలో నూరవవంతయినా
మాకుకూడ కలిగితే మా జీవితం ధన్యమవుతుంది
దీపం తాను కాలిపోతూ,
తన చమురును తాను వ్యయంజేసికొంటూ
ఇంటిలోని వారికి వెలుతురు నిస్తుంది
అలాగే మేముకూడ మా ఆయుస్సునీ మా జీవితాన్నంతటినీ
నీ సువిశేష సేవలో వ్యయంబేసికొంటే యెంత బాగుంటుంది!

58. శక్తిసామర్థ్యాలు

మత్తయి 25, 14-30

క్రీసూ! నీవు ముగ్గురు సేవకుల కథ చెప్పావు
ఒక యజమానుడు తన సేవకులను ముగ్గురునీ పిల్చి
ఒకనికి ఐదు సంచులూ, ఒకనికి రెండు సంచులూ,
ఒకనికి ఒకసంచీ రూకలు అప్పగించాడు
అతడు పనిమిూద దూరదేశానికి వెళ్ళి తిరిగివచ్చేలోపల
ఐదు సంచులు పుచ్చుకొన్నవాడు మరి ఐదు సంచులూ
రెండు సంచులు తీసికొన్నవాడు మరి రెండు సంచులూ
సౌమ్మ గణించగా యజమానుడు ప్రీతి చెందాడు
కాని మూడవ సేవకుడు తాను పుచ్చుకొన్న రూకలమిూద
ఏ మాత్రమూ ఆదాయం గణించనందున