పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యజమానుడు మండిపడి 'ఓరి సోమరిపోతూ!
నీవు నా సౌమ్మవిూద కనీసం వడ్డీయైనా రాబట్టావు కావు
కావున నీ సంచిని గూడ ఆ మొదటివానికే యిస్తాను" అన్నాడు
ప్రభూ! నీవు చెప్పిన ఈ కథ మా జీవితానికీ వర్తిస్తుంది
నీవు మాకు పలువిధాలైన శక్తిసామర్థ్యాలు ప్రసాదిస్తావు
మేము కృషిచేసి ఈ వరాలను వృద్ధిచేసికొంటే
నీవు సంతోషిస్తావు, లేకపోతే కోపిస్తావు
కనుక తెలివితేటలున్నవాడు చక్కగా చదవాలి
సేవాగుణమున్నవాడు పదిమందికీ పరిచర్య చేయాలి
నాయకత్వమున్నవాడు బృందాలను నడిపించాలి
హాన్యచతురుడు వినోదకార్యక్రమాలు చేపట్టాలి
ఆటపాటల్లో శక్తిగలవాడు ఆడాలి పాడాలి
భక్తిగలవాడు నీ గ్రంథాన్ని చదివి ప్రార్థనలు చేయాలి
ఈ విధంగా నీవు మాకు దయచేసిన మేలిగుణాలు
మేము స్వీయకృషితో పెంపులోకి తెచ్చుకోవాలి
కాని మేము సోమరితనంతో వట్టినే కాలక్షేపం చేస్తాం
నీ వరాలను గుర్తించం, లెక్కచేయం, వృద్ధిచేసికోం
స్వయంకృషి లేదు కనుకనే నీ దీవెనలకు నోచుకోక
జీవితాంతమూ ఎక్కడున్న వాళ్ళ మక్కడే వుండిపోతాం
ప్రభూ! మా యీ యవివేకాన్ని మన్నించి
మాకు జ్ఞానోదయం కలిగించు.

59. శిష్యుల గొప్ప యేమిటి?

1కొరి 1, 18-31.

ప్రభూ! నీవు పండ్రెండు మంది శిష్యుల నెన్నుకొన్నావు
కాని వాళ్ళ స్తోమతను పరికిస్తే ఆశ్చర్యం కలుగుతుంది
వాళ్లు యూదసమాజంలోని అట్టడుగు వర్గమైన సుంకరులు
చదువు సంధ్యలులేని పామరులు, చేపలుపట్టే బెస్తలు
అలాంటి జనంతో ఏ నాయకులైనా
ఏమిసాధిస్తారా అని ఆశ్చర్యం కలుగుతుంది
ఐనా నీవు అలాంటి ముడిసరుకునే చేరదీసి తర్ఫీదు నిచ్చావు
నీ యాత్మ వాళ్ళను శక్తితో నింపి మహాప్రేషితులను చేసింది
పండితులైన ఆనాటి యూదులూ గ్రీకు రోమను విద్వాంసులుకూడ