పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ భూమే లేకపోతే మేము పట్టాక ఎక్కడ వసిస్తాం?
నీవు మాకు నీళ్ళ సమృద్ధిగా దయచేసావు
ఆ జలాన్ని మేము ఆప్యాయంగా త్రాగుతాం
శరీరశుద్ధికి వాడుకొంటాంగూడ
అలాగే నీవు సృజించిన గాలిని హాయిగా పీల్చుకొంటాం
నీవు కలిగించిన ఋతువులు - విశేషంగా వానకాలమూ
చలికాలమూ ఎండ్లకాలమూ ఎన్నెన్నో మార్పులు తెస్తాయి
నీవు మొలిపించే చెట్టుచేమలు ఎన్నో పూలు పూస్తాయి
నోరూరించే పండు ఎన్నో ఫలిస్తాయి
సస్యజాతులు బంగారు పంటలు పండుతాయి
మాకోసం నీవు ఎన్నో పశువర్గాలను సృజించావు
ఎన్ని పక్షులు ఆహ్లాదంగా ఎగురుతూంటాయి
నీవు గగనాన నిల్పిన సూర్యుడు లోకానికంతటికీ
వేడినీ వెలుగునీ ప్రసాదిస్తుంటాడు
తళతళలాడే చందమామ వెన్నెల ఎంత హాయిగా వుంటుంది!
ఇంకా నీవు విరామాలూ సెలవులూ ఆటపాటలూ
మొదలైనవి కల్పించి మా బడలికలు తీరుస్తుంటావు
సుఖనిద్ర కల్పించి మాకు విశ్రాంతిని దయచేస్తావు
సినిమాలు, రేడియోలు, పత్రికలు, గ్రంథాలు, టీవీలు
మొదలైనవాటిద్వారా విజ్ఞానవినోదాలు చేకూర్చిపెడతావు
ఎవరివద్దనుండయినా ఒక్కజాబు వస్తే ఎంతగా సంతోషిస్తాం
ఇక బస్సులూ రైళ్ళూ మొదలైన ప్రయాణ సాధనాలు
అనతికాలంలోనే మమ్మ దూరనగరాలకు కొనిపోతాయి
మాకు వలసిన వస్తువులన్నిటినీ సరఫరా చేస్తుంది స్థానిక పట్టణం
ప్రభూ! నీవు దయచేసిన ఈ వస్తువులన్నిటిలోను
నీ నిజరూపాన్ని దర్శించి నీకు కృతజ్ఞలమైయుండే భాగ్యాన్ని
నీ బిడ్డలమైన మాకు ఏప్రాదూ దయచేయి.

47. సాలోమోను మనవి

1రాజు 3,4-15

ప్రభూ! పూర్వం సాలోమోను చక్రవర్తి
నిన్ను సేవించడానికి గిబ్యోను పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు
నీ వచట ఆ రాజుకి కలలో కన్పించి
ఏమి వరం కావాలో కోరుకొమ్మని అడిగావు