పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆశ్చర్యం కలుగుతుంది
కృతజ్ఞత అనేది నాలో కలికానికైనా వుందా?
నీ చలవవల్ల నాకు చక్కని ఆరోగ్యం లభించింది
తెలివితేటలబ్బాయి పైచదువులు ముగించుకొన్నాను
చిన్నదో పెద్దదో ఉద్యోగంగూడ దొరికింది
చాలా విజయాలు సాధించాను
నా జీవితయాత్ర సాఫీగానే సాగిపోతూంది
తోడివారిలో నాకొక గుర్తింపంటూ వుంది
పేరుప్రతిష్టలుకూడ అబ్బాయి
మరి యీ వరాలన్నిటికీ నేను ధన్యవాదాలు తెల్పుకోక
మూగెద్దలా మౌనంగా వుండిపోయినందుకు
నాకే సిగ్గువేస్తూంది
పైపెచ్చు నా తెలివితేటలవల్లనే
నేను రాణించాననుకొన్నాను
నా జాగ్రత్తవల్లనే విజయాలు సాధించాననుకొన్నాను
నాకు నేనే మురిసిపోయాను, నన్ను నేనే పొగడుకొన్నాను
ఇతరులుకూడ నన్ను పొగడాలని లోలోపల కోరుకొన్నాను
కాని ఈ పద్ధతి నీకు నచ్చుతుందా?
పూర్వం మూడవ హేరోదు దేవుణ్ణి గౌరవింపక
తన్ను తాను ఘనంగా యెంచుకోగా
ఓ దేవదూత అక్కడికక్కడే అతన్ని ఫరోరంగా శిక్షించాడు
ఈలాంటి శిక్షే నాకూ ప్రాప్తించి వుండవలసింది
కాని నీ కరుణవల్ల ఆ దండనం తప్పిపోయింది
ఇకనైనా నేను బుద్ధితెచ్చుకొని
నీకు వందనాలర్పిస్తే బాగుంటుంది
కనుక ప్రభూ! నాలోని కృతఘ్నతాభావాన్ని
నేను ఏవగించుకొనేలా చేయి
రోజు కొక్కసారైనా నీ వుపకారాలకు
నీకు కైమోడ్పులర్పించే భాగ్యం దయచేయి.

46. ప్రాకృతిక వరాలు

ప్రభూ! నీవు ఎన్ని ప్రాకృతికవరాలు దయచేసావు?
బిడ్డ పుట్టకమునుపే తల్లి ఉయ్యెలను సిద్ధంచేసినట్లుగా
మేము పట్టకముందే నీవు ఈ నేలను తయారుచేసావు