పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈలాంటి భీకరతరంగాలు
మా సంసారసాగరంలో చాలా చెలరేగుతూంటాయి
కాని ఈలాంటి విపత్తులకు గురైనపుడు
ఆ శిష్యుల్లాగే మేమూ నీకు మొరపెట్టాలి
మా శక్తికి మించిన శ్రమలు మమ్ము నలగదొక్కుతున్నాయి
నీ వాదుకోకపోతే మాకు దిక్కులేదని
నీకు మనవి చేసికోవాలి
ఈలూ నిన్నర్ధిస్తే నీవు మా యిక్కట్టలను తీర్చనైనా తీరుస్తావు,
లేదా ఆవేదనలను భరించే శక్తినైనా మాకు ప్రసాదిస్తావు
మేము నీ దివ్యచిత్తానికి లొంగి నీవు పంపే సిలువలను
మంచి మనసుతో స్వీకరించే సదృద్ధిని దయచేస్తావు
అసలు మమ్మ నీ చెంతకు రాబట్టుకోడానికే
నీవు మాకు ఆయా ఆపదలను పంపిస్తూంటావు
తుఫానులు సోకందే మాలో చాలమంది నీచెంతకురారు
కనుక నీవు మాకు పంపే కష్టాలను నీ పిలుపులనుగా భావించి
మా బాధలన్నిటిలోను భక్తజనశరణ్యుడవైన నిన్నాశ్రయించి
నీ ముందట వినయంతో మోకరిల్లే
మహాభాగ్యాన్ని ప్రసాదించు.

44. విజ్ఞాపనం

అచ 12,1-10. యాకోబు 5,16.

ప్రభూ! హేరోదు క్రూరబుద్ధితో పేత్రుని చెరలో త్రోయించి
కత్తితో పొడిచి చంపడానికి సంసిద్దుడయ్యాడు
అప్పడు యెరూషలేములోని భక్తసమాజం నీకు మొరపెట్టింది
ఆ విజ్ఞాపనం ఫలితంగా నీవొక దేవదూతను పంపగా
అతడు పేత్రుని చెరనుండి విడిపించాడు
కావలకాసేవాళ్లు కాస్తూండగానే
చెరసాల తలుపులు వాటంతట అవే విచ్చుకొన్నాయి
పేత్రు సురక్షితంగా కారాగారంనుండి వెలుపలికి వచ్చాడు
అలా భక్తుల విజ్ఞాపనంవల్ల అతడు బ్రతికిబయటపడ్డాడు
మేము సాంఘిక వైద్య విద్యాది నానాసేవలు చేస్తూంటాం
అన్నదానమూ శ్రమదానమూ విత్తదానమూ చేస్తూంటాం
కాని ఈ దానాలు ఈ సేవలకంటె