పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రార్థనాసేవ తక్కువదేమి కాదు అనడానికి
పై పేత్రు దృష్టాంతమే తార్కాణం
సత్పురుషుల ప్రార్ధనం మహాశక్తితో పనిచేసి
ఇక్కట్టలో వున్నవాళ్ళ ఆపదలను తొలగించితీరుతుంది
కనుక మేము నిరంతరం తోడివారికొరకు నీకు మనవి చేయాలి
మేము చదువుచెప్పే పిల్లలకు పాఠాలు చెస్తేనే చాలదు
వాళ్ళ శ్రేయస్సుకొరకు ప్రార్థనలు కూడ చేయాలి,
మేము పరామర్శించే రోగులకు మందులిస్తేనే చాలదు
వాళ్ళ ఆరోగ్యంకొరకు విన్నపాలుకూడ చేయాలి,
మేము సాంఘిక సేవచేసే పేదలకు వస్తువులనిస్తేనే చాలదు
వాళ్ళ అభివృద్ధికొరకు వేడికోళ్లనుగూడ అర్పించాలి,
ఇంకా మా మిత్రులూ శత్రువులూ ఇరుగుపొరుగువాళ్ళూ
బ్రతికివున్నవారూ చనిపోయినవారూ అందరికొరకూ
రోజురోజు భక్తితో నీ ముందట మోకరిల్లుతూండాలి
అలా ప్రణమిల్లితే నీవు మా మొరలాలించి
బాధారుల శ్రమలు తీరుస్తావు
రేపు మేము ఇక్కట్టుల్లో వున్నపుడు
కొందరు భక్తులను ప్రేరేపించి
వాళ్ళ మాకొరకు ప్రార్థనలర్పించేలా అనుగ్రహిస్తావు కూడ.

45. పదిమందిలో ఒక్కడు

లూకా 17,11-19. అచ 12,21-23

ప్రభూ! నీవు పదిమంది కుష్టరోగులకు వ్యాధి నయంచేస్తే
వాళ్ళల్లో ఒక్కడు వచ్చి నీకు ధన్యవాదాలర్పించాడు
ఆ వచ్చినవాడుకూడ యూదుడు కాదు
సంకరజాతి సమరయుడు
ఈ సంఘటనకు నీవు మనసునొచ్చుకొని నిటూర్పు విడిచావు
"తతిమ్మా తొమ్మిదిమంది యేమయ్యారు
దేవుణ్ణి స్తుతిద్దామనే బుద్ధి వాళ్ళకు పుట్టనేలేదా?" అన్నావు
కాని అవి మంచిరోజులు కనుక
పదిమందిలో ఒకడైనా కృతజ్ఞతాపరుడు తగిలాడు
ఈ కాలంలో ఐతే నూరురిలో ఒకడైనా అలాంటి వాడుండడేమో!
ఈ సంఘటనం గుర్తుకువస్తే నామట్టకు నాకే