పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42. అడగండి

లూకా 11,9-13. మార్కు 14,36

ప్రభూ! నీవేమన్నావు? "నా పేరిట మిరేమి యడిగినా
తండ్రి మికు తప్పక దయచేస్తాడు
కుమారుడు ఆకలిగొని రొట్టెనడిగితే
తండ్రి రాతినీయుడు గదా?
అలాగే చేపనడిగితే పాము నీయడు గదా?
ఈలా భూలోకంలోని తండ్రులు తమపిల్ల లడగగానే
హితకరమైన వస్తువుల నిస్తూంటే
పరలోకంలోని తండ్రి మాత్రం తన్నడిగే భక్తుల
కోర్కెలు తీర్చకుండా వుంటాడా?
కనుక అడగండి ఆ తండ్రి మికు దయచేస్తాడు,
తట్టండి అతడు విూకు తలుపు తెరుస్తాడు,
వెదకండి విూకు కావలసింది దొరుకుతుంది"
అని బోధించావు - సరే బాగానే వుంది
ఐనా మాకో సందేహం సుమా!
ఒకోమారు మేము ఎంత ప్రాధేయపడి అడిగినా
ఆ తండ్రి మామొర విన్పించుకొన్నట్లయినా కన్పించడు
ఇంకా ఆనాడు నీవు ఓలివు తోపులో చాగిలపడి
"నాన్నా! ఈలాంటి శ్రమకు నన్ను గురిజేయకు
ఐనా నీ చిత్తంగాని నా చిత్తంగాదు" అని మనవిచేస్తే
మరి ఆ తండ్రి నీ శ్రమను వీసమైన తొలగించలేదేం?
అతడు నిర్ణయించినట్లుగా నీవు సిలువనెక్కవలసి వచ్చిందేం?
ఇక్కడేదో రహస్యం ఉండివుండాలి కదూ?
అడగడానికేం జనం ఏదైనా అడుగుతారు
కాని తామడిగేది మంచిదో కాదో యెందరికి తెలుసు?
మేము వేదేది మాకూ మాతోడివారికీ మేలు చేయనపుడు,
దైవచిత్తానికి సమ్మతం కానపుడు,
మేము వేయిసార్లు వేడినా ఆ తండ్రి విన్పించుకోడని
దీన్నిబట్టే విశదం గావడంలేదూ?