పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనుక నీవు మియమ్మను ఎంతగా గౌరవించి ప్రేమించావో,
మేమూ ఆ తల్లిని
ఎంతగా గౌరవించి ప్రేమించాలని కోరుకొన్నావో
అంతగానే ఆమెను గౌరవించి ప్రేమించే భాగ్యం
నీ శిష్యులమైన మాకు ఏ ప్రాద్దూ దయచేయి.

41. క్రీస్తు ప్రార్ధనం

మార్కు 1,35. మత్త 14,23. లూకా 6,12

మత్త 6,5-6, లూకా 11,1-2

ప్రభూ! నీ ప్రార్ధనాపద్ధతిని పరిశీలిస్తే
మాకు కూడ భక్తి భావం పట్టుకవస్తుంది
నీవు వేకువజాముననే లేచి
నిర్ధనప్రదేశానికి వెళ్ళి ప్రార్థించేవాడివి
కొండపైకెక్కి యేకాంతంగా
తండ్రిని ధ్యానించుకొనేవాడివి
రాత్రియంతా జపంలో గడిపేవాడివి
పదిమంది కంటబడేలా కాకుండ
రహస్యంగా ప్రార్ధనచేయడం నీకిష్టం
నీ ప్రార్థనకు మురిసిపోయి శిష్యులు
"స్నాపక యోహాను తన శిష్యులకు మల్లె
నీవూ మాకు ప్రార్ధన నేర్పు" అని అడిగారు
అప్పడు నీవు దేవుని చనువుతో "నాన్నా" అని పిలిస్తే.
నరుడు దేవునికి చిత్తానికి లొంగి జీవిస్తే
అది ఉత్తమ ప్రార్థన మౌతుందని చెప్పావు

ప్రభూ! ఎప్పడు, ఎక్కడ, ఏలా జపించాలో
మా కట్టే తెలియదు
కాని జపించాలనే కోరికమాత్రం
మా హృదయంలో గాఢంగా వుంది
నాడు శిష్యులకు మల్లె నేడు మాకుగూడ
నీవే ప్రార్ధనం నేర్పు
నీ యాత్మ మా హృదయాలను మేలుకొల్పి
వానిలో నుండి ప్రార్ధన పెల్లుబికివచ్చేలా దయచేయుగాక.