పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దప్పిక గొనిన దుప్పి సెలయేటి నీళ్ళకుమల్లె

నా హృదయం ప్రభువు కొరకు తపిస్తూంది

సజీవుడైన దేవుని కొరకు

నేను ఆరాటం చెందుతూన్నాను అన్నాడు

మరో కీర్తనకారుడు - నీవే నాకు దేవుడవు

నేను నీకొరకు ఉబలాటం చెందుతున్నాను

నీళ్ళలేక యెండి మాడిపోయిన నేలలాగ

నాయాత్మ నీకోసం దప్పికగొంటూంది అని పల్మాడు

నీ భక్తులు నీకొరకు తపించిపోయిన తీరు ఈలా వుంటుంది

కాని మట్టిమానుసులమైన మాకు ఈలాంటి కోరికలు పట్టవు

పూర్వవేదపు ప్రజల్లాగే మేమూ రెండు తప్పలు చేసాం

అవివేకంతో జీవధారమైన నిన్ను విడనాడాం

నీటికోసం రాతిచట్టులో తొట్టిని తొలిపించుకొన్నాం

కాని అది నెర్రెలు విచ్చినందున దానిలో నీళ్ళ నిలువవు

కనుక మా దౌర్భాగ్యానికిగాను మేము గాఢంగా పరితపిస్తున్నాం

ఐతే మా పాలిటి భాగ్యదేవతయైన క్రీస్తు

సుఖారు బావిచెంత సమరయ మహిళతో మాటలాడుతూ

ఈ నీళ్లు త్రాగితే మరల దప్పిక వేస్తుంది

నేనిచ్చే నీళ్లు త్రాగితే యిక దప్పిక వేయదు

నేనిచ్చే జీవజలం నరుల యెడదల్లో నీటిబుగ్గలా వూరుతూ

వారికి నిత్యజీవం దయచేస్తుంది అని వాకొన్నాడు

ఈలా క్రీస్తు మాకు దయచేసే జీవజలం పవిత్రాత్మే

ప్రభువు సిలువమిూద వ్రేలాడుతుండగా

అతని ప్రక్కను ఈటెతో తెరచారు

వెంటనే అతని హృదయంనుండి నీళ్లు స్రవించాయి

ప్రభువు పేర్కొన్న జీవజలమూ పవిత్రాత్మా ఈ నీళ్ళే

తండ్రీ! నీనుండీ క్రీస్తునుండీ బయలుదేరే ఆత్మ

ఓ మహా జలప్రవాహంలాగ మామిూదికి దుమికివస్తుంది

మే మా జలాలు గ్రోలి దప్పిక తీర్చుకోవాలి

నీ కుమారుడైన క్రీస్తు దప్పికగొన్నవాళ్ళ నందరినీ