పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎఫే 5, 22-28 ఈ సూత్రానికి తగ్గట్టగా భార్యాభర్తలమైన మేము పరస్పర పేమతో జీవిస్తుంటామా? మేము ఒకరినొకరం వరప్రసాద సాధనంగా గణిస్తుంటామా? 3.ఆదాము పాపఫలితంగాపురుషుడికి స్త్రిబానిస అయింది - ఆది 3,16. కాని క్రీస్తు నరులపాపానికి ప్రాయశ్చితం చేసి ఈ శాపాన్ని తొలగించాడు. ఐనా నేను ఈనాడుకూడా నా భార్యను బానిసను చూచిన చూపున చూడ్డం లేదా? 4.వివాహసంస్కారం ద్వారా దంపతుల్లోని జంతుప్రేమ దివ్యప్రేమగా మారాలి. కాని దంపతులమైన మా ప్రేమలో కామమెన్నిపాళ్ళ ? పవిత్రప్రేమ ఎన్నిపాళ్లు? 5.దంపతుల లైంగిక క్రియద్వారా దేవుడు తన్ను పోలిన నరులను సృజిస్తాడు. అది భగవంతుని సృష్టికి అనుసృష్టిలాంటిది. ఆలాంటి లైంగికక్రియలో భార్యాభర్తలమైన మేము పవిత్రమైన ఉద్దేశంతో పాల్గొంటుంటామా? 6.లైంగిక క్రియలో నేనెంతగా సుఖించానా అని ఆలోచించడం కామం. నా భాగస్వామిని ఎంతగా సుఖపెట్టానా అని ఆలోచించడం ప్రేమ. ఈ రెండింటిల్లో నా పద్ధతి యేది? 7. భార్యాభర్తలు ఒకరు కోరినప్పడొకరు దేహదానం చేసికోవాలి - 1కొ 7, 3.4 నా వివాహజీవితంలో ఈ దాంపత్యపుణ్యాన్ని హృదయపూర్వకంగా పాటిస్తుంటానా? 8. ప్రభువు ఇచ్చినపుడు సుఖాలు అనుభవించినట్లే అతడు తీసికొనిపోయినపుడు కష్టాలు అనుభవించాలి - యోబు 2, 9–10. సిలువ నా కుటుంబం మీద భారంగా సోకినపుడు నేను దానిని ఓపికతో భరిస్తుంటానా? వ్యభిచార దోషంవల్ల నా భాగస్వామికి అపరాధం చేస్తున్నానా? మత్త 5, 27-28 1S 6, 15-20. 9.భక్తుడికి శారీరక వ్యభిచారమూ తగదు, మానసిక వ్యభిచారమూ తగదు అన్న సూత్రాన్ని గమనిస్తుంటానా? భార్యాభర్తల పరస్పర ప్రేమ వివాహధర్మాల్లో మొదటిదైతే, రెండవధర్మం సంతానాన్ని కనడం - ఆది, 1,28. 10.దేవుడు నాకిచ్చిన బిడ్డలను నేను మనస్పూర్తిగా అంగీకరిస్తున్నానా? ఆ బిడ్డల పుట్టువును కృత్రిమంగా నిరోధించడంలేదుకదా! 11.కన్న బిడ్డలను గాలికి వదలివేయక వారిని మంచి క్రైస్తవులనుగా పెంచి పెద్దచేస్తున్నానా? 12. గురువు దైవకార్యాల్లోలాగే గృహస్తుడు ప్రపంచకార్యాల్లో నిమగ్నుడు కావాలి - అది 1, 28. దేవుడు నాకు నియమించిన పనిని నేను సంతృప్తికరంగా చేస్తున్నానా?