పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. మన గృహమే ఒక దేవాలయం - 1కొ 16, 19. మా గృహ దేవాలయంలో క్రైస్తవవాతావరణమూ, తగినంత భక్తీ, అనుదిన ప్రార్ధనా కన్పిస్తుంటాయా? మా బిడ్డల్లో ఎవరికైనా దేవుని పిలుపు వుంటే తల్లిదండ్రులమైన మేము అడ్డు చెప్పడం లేదుకదా?

ప్రార్ధనం

ఓ ప్రభూ! గురువు గురుజీవితంద్వారా, మఠకన్యకన్యాజీవితంద్వారా పవిత్రులైనట్లే గృహస్థలు సంసారజీవితంద్వారా పవిత్రులు కావాలని నీవు సంకల్పించుకొన్నావు. నీ కోరికననుసరించి మేము ఈ వివాహబంధాన్ని ఎన్నుకొన్నాం. కనుక మేము కుటుంబధర్మాల ప్రకారం పవిత్ర జీవితం జీవించి కడన నీబహుమతిని పొందే భాగ్యం దయచేయి - ఆమెన్.

7. సోదర ప్రేమ

1. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ ప్రేమాజ్ఞమీదనే ఆధారపడతాయి — మత్త 24, 3440. ఈలాంటి ముఖ్యమైన ఆజ్ఞను నేను జాగ్రత్తగా పాటిస్తున్నానా?
2. పరలోకంలోని తండ్రి మంచివాళ్ళకీ చెడ్డవాళ్ళకీ కూడ వాన కురిపిస్తాడు - మత్త 5,45, ఈలాంటి తండ్రిని చూచి నేను విరోధులను క్షమించవద్దా? జనుల్లో కొందరిని ఆదరించి మరికొందరిని నిరాదరణం చేయకుండా వుండొద్దా?
3. మనం పరులను గూర్చి తీర్పు చేయకుండా వుంటే దేవుడు కూడ మనలను గూర్చి తీర్పుచేయడు - లూకా 6.87. నేను తరచుగా పరులను విమర్శించడం తేడా?
4. నాలుకను అదుపులో పెట్టుకొనేవాడు సత్పురుషుడు. - యాకో 3, 2-12. నా నోరు మంచిదేనా?
5. మన కానుకలు దేవుని పీఠం వద్దనే వదలిపెట్టి మొదటవెళ్ళి మన పొరుగువారితో రాజీపడిరావాలి — మత్త 5, 23-24, కాని నేను దైవప్రేమను ఘనంగా యెంచి సోదరప్రేమను చులకన చేయడం లేదా?
6. నా సోదరులకు చేసింది నాకు చేసినట్లే భావిస్తానన్నాడు ప్రభువు - మత్త25,40, నేను అక్కరలో వున్న జనాన్ని ఎంతవరకు పట్టించుకొంటున్నాను?