పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనుకనే ప్రభువు అతనికి చూపు దయచేసాడు. నేడు మన ప్రార్థనలో కూడ ఈ గుణాలుండాలి. బర్తిమయికి కావలసింది మామూలు చూపు. మనకు కావలసింది ఆధ్యాత్మికమైన చూపు. మనం మన భక్తి విశ్వాసాలను పెంచమని దేవుణ్ణి అడుగుకోవాలి.

34. మిగిలిన తొమ్మిదిమంది యేరీ - లూకా 17,17

యేసు పదిమంది కుష్టరోగులను శుద్ధి చేసాడు. వారిలో తొమ్మిదిమంది యూదులు, వీళ్లంతా ఆరోగ్యాన్ని పొంది హాయిగా వెళ్లిపోయారు. దేవునికి వందనాలు చెప్పలేదు. పదవవాడు సమరయుడు, ఇతడు మాత్రం క్రీస్తు దగ్గరకు తిరిగి వచ్చి వందనాలు చెప్పాడు. ప్రభువు ఇతని కృతజ్ఞతాభావాన్ని మెచ్చుకొన్నాడు. మొదటి తొమ్మిది మందికి శారీరకారోగ్యం మాత్రమే లభించింది, కాని పదవవానికి ఆధ్యాత్మకారోగ్యం కూడ లభించింది. అనగా అతని విశ్వాసం పెరిగింది. అతడు క్రీస్తులోని దివ్యశక్తినీ, దివ్యత్వాన్ని గుర్తించాడు. దేవుడు మనకు ఎన్నో వుపకారాలు చేస్తుంటాడు. ఆ వుపకారాల్లో మనం దేవుని హస్తాన్ని గుర్తించాలి. దేవుని దయవల్లనే మనకు ఆ మేలు కలిగిందని గ్రహించి అతన్నిస్తుతించాలి. చాలమంది మేళ్లు పొంది కూడ దేవుణ్ణి మరచిపోతారు. వీళ్ళ ఈ కథలోని తొమ్మిదిమంది లాంటివాళ్ళు.

35. తుఫానులో చిక్కిన పడవ - మత్త 8, 23, 27

క్రీస్తు శిష్యులు గలిలీ సరస్సులో పడవలో పోతుండగా దిడీలున తుఫాను పట్టుకొంది. పడవ మునిగిపోయేలా వుంది. క్రీస్తు నిద్రపోతున్నాడు. శిష్యులు మునిగిపోతామని భయపడి క్రీస్తుని తట్టి లేపారు. మమ్మ కాపాడమని మొరపెట్టుకొన్నారు. మీరు అల్పవిశ్వాసులు అని ప్రభువు వారిని మందలించాడు. వారికి క్రీస్తుపట్ల కొంత విశ్వాసముంది. కాని పూర్తి నమ్మకం లేదు. వాళ్ళ ఇదివరకే క్రీస్తు అద్భుతాలు చూచారు. ఐనా ఇతడుంటే మనకు పర్వాలేదు అనుకోలేదు, కడన ప్రభువు అద్భుతంగా తుఫానును అణచివేసి శిష్యులను కాపాడాడు, ఈ శిష్యులకులాగే మనదికూడ అపరిపూర్ణమైన విశ్వాసం. కనుక మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేయమని ఆ ప్రభువుని అడుగుకోవాలి. తుఫానులో చిక్కిన ఆ పడవ మనలనే సూచిస్తుంది. కనుక మన ఆపదల్లో, మనలను గట్టెక్కించమని ప్రభువుని వేడుకోవాలి.

36. నీటిపై పేత్రు నడక - మత్త 14, 28-31

శిష్యులు పడవలో పోతున్నారు. వేకువజామున క్రీస్తు నీటిపై నడుస్తూ పడవ దగ్గరికి వచ్చాడు. శిష్యులు క్రీస్తుని చూచి దయ్యమేమోనని భయపడ్డారు. ప్రభువు వారికి అభయమిచ్చి ధైర్యం చెప్పాడు. పేత్రుకూడ పడవదిగి క్రీస్తులాగే నీటిమీద నడవబోయాడు.