పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆగాయం క్రీస్తు ప్రేమకు నిదర్శనమని భావించేవాళ్లు. ఈ భక్లే క్రమేణ శ్రీహృదయ భక్తిగా మారింది. 17వ శతాబ్దంలోని భక్తరాలు మర్గరీత మరియమ్మకు ప్రభువు దర్శనమిచ్చి తన హృదయాన్ని చూపించాడు. అప్పటినుండి శ్రీహృదయ భక్తి బాగా వ్యాప్తిలోకి వచ్చింది.

ఇక భక్తులు క్రీస్తు ప్రక్కలోని గాయాన్నీ అతని హృదయాన్నీ ప్రేమనీ స్మరించుకొని చేసిన ప్రార్థనలను తిలకిద్దాం.

1. హృదయమందిరం

ప్రభూ! నేను నీ హృదయంలో వసిస్తే ఎంత బాగుంటుంది!
నా హృదయంలోని ఆలోచనలతోను భావాలతోను
నేను నీ హృదయంలోనికి ప్రవేశించాలని నా కోరిక
నీ హృదయం దేవాలయంలాంటిది
దైవసాన్నిధ్యంగల మందసంలాంటిది
ఈ హృదదయ మందిరంలో నేను నిన్నారాధిస్తాను
నీకు నా మనవులు విన్నవించుకొంటాను
నా సోదరుడవు, స్నేహితుడవు, రాజువనైన
నీ హృదయాన్ని నేను దర్శించగలిగాను
ఈలాంటి హృదయానికి నేను మొక్కలు చెల్లించవద్దా?
అసలు నీ హృదయమే నా హృదయం
కనుకనే నేను నీ హృదయానికి ప్రార్ధన చేస్తున్నాను
నా వేడికోలు నీ యెడదలోనికి ప్రవేశించుగాక
నీవు నా మొర ఆలింతువుగాక
పావనమూర్తివైన నీవు నా మాలిన్యాన్ని కడిగివేయి
నా చిన్న తప్పిదాలనుగూడ తుడిచివేయి
పరిశుద్ధమూర్తివైన నీ వలన శుద్ధినిపొంది
నేను నీ హృదయమందిరంలోనికి ప్రవేశిస్తాను
జీవితాంతమూ ప్రతిరోజూ అక్కడే వసిస్తాను
ఆ పవిత్ర మందిరంలో నీ దివ్యచిత్తాన్ని తెలిసికొంటాను
దాన్ని పాటించే శక్తినికూడ పొందుతాను.
 - భక్తుడు బెర్నార్డు, 12వ శతాబ్దం