పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. క్షయవస్తువులైన వెండి బంగారాల వలన మీకు విమోచనం లభించలేదు. నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్లవంటివాడగు క్రీస్తు అమూల్యరక్తం ద్వారా మీకు విమోచనం లభించింది" - 1 పేత్రు 1, 18-19. పూర్వం బానిసల యజమానులకు వెండి బంగారాలు చెల్లించి ఆ బానిసలను దాస్యంనుండి విడిపించేవాళ్ళ మనం పాపంద్వారా పిశాచానికి బానిసలమై యున్నపుడు క్రీస్తు నశ్వర వస్తువులైన వెండి బంగారాలద్వారా మనలను విడిపించలేదు. మరి తన నెత్తుటిద్వారా అతడు మనలను పాపదాస్యంనుండి విడిపించాడు. ఆ నెత్తురు అమ్యూలమైనది. అనగా విలువకట్టరానిది. అతడు నిర్లోషి, నిష్కల్మషుడు. అనగా మహా పవిత్రుడు, దేవుని కుమారుడు, అట్టివాని నెత్తురు ఎంత పవిత్రమైయుండాలి? ఆలాంటి నెతురు మనకు విమోచనం కలిగించింది. - హెబ్రే 9, 13-14

2. "నీవు బలి కావింపబడితివి
నీ రక్తం ద్వారా
ప్రతి జాతినుండి, భాషనుండి, ప్రజనుండి, తెగనుండి
దేవునికి నరులను కొనితెచ్చితివి" - దర్శ 5,19

క్రీస్తు సిలువమీద బలియయ్యాడు. సొంత నెత్తురులు చిందించాడు. ఈలా అతడు మనలను పాపంనుండి విమోచించాడు. ఈ విమోచనం ద్వారా అతడు దేవునికి క్రొత్తప్రజలను సంపాదించి పెట్టాడు. ఈ ప్రజలను అన్నిదేశాల్లోనుండి, అన్ని జాతుల్లో నుండి వచ్చినవాళ్ళ అనగా ప్రభువు తన సిలువ మరణం ద్వారా అందరినీ దేవుని ప్రజలను చేసాడని భావం.

3. పూర్వవేదంలో సీనాయి కొండ దగ్గర దేవుడు యిప్రాయేలు ప్రజలతో నిబంధనం చేసికొన్నాడు. ఆ నిబంధనం నెత్తురుద్వారా జరిగింది, మోప్నే కో: నెత్తుటిని ప్రజలమీద చల్లుతూ "ఇది ప్రభువు మీతో చేసికొన్న నిబంధన రక్తం" అన్నాడు — నిర్గ 24,8. ఇది ప్రాత నిబంధనం. క్రీస్తు తన నెత్తుటితో మళ్ళీ మనతో నిబంధనం చేసికొన్నాడు. అతడు ద్రాక్షసారాయపు పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరందరూ ఈ పాత్రలోని రక్తాన్ని త్రాగండి. ఇది అనేకుల పాపపరిహారానికి చిందబడనున్న నిబంధనపు నా రక్తం" అన్నాడు — మత్త 26,28. ఇక్కడ "నిబంధనపు నా రక్తం" అనడం ద్వారా క్రీస్తు సీనాయి నిబంధనాన్ని జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు. ఆ నిబంధన ద్వారా యిప్రాయేలీయులు యావే ప్రజలయ్యారు. ఈ నిబంధన ద్వారా మనం క్రీస్తు ప్రజలమరొతాం. ఆ నిబంధనం ఎడ్లనెత్తటితో జరిగింది. కాని ఈ నిబంధనం క్రీస్తు సొంత నెత్తటితోనే జరిగింది. దానికంటే యిది ఎంతో శ్రేష్టమైంది.