పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు శ్రమననుభవించడం మొదలు పెట్టినప్పటినుండి, విశేషంగా సిలువ నెక్కినప్పటినుండి, నెత్తురు చిందిస్తూనే వున్నాడు. అతడు తన మరణం దాకా, ఆ మరణం ముగిసి అతని ప్రక్కను ఈటెతో తెరచాక గూడ, నెత్తురు కార్చాడు. ఈ పవిత్ర రక్తమే మనకు పాపవిమోచనం కలిగించింది. సిలువ మీద అతని ప్రక్కనుండి కారినది అతని నెత్తుటిలో చివరిబోట్లు అనుకోవాలి. ఈ నెత్తుటిద్వారానే అతడు మనతో ప్రేమపూర్వకమైన నూత్ననిబధనం చేసికొన్నాడు. ఆ ప్రభువు ప్రేమను అర్థంచేసికోవడానికి పై వేదవాక్యాలు ఉపయోగపడతాయి.

3. క్రీస్తు ప్రక్కలో నుండి నీళ్ళు కారడం

1. జలాలు ప్రవించడం

క్రీస్తు ప్రక్కను బల్లెంతో పొడువగా నీళ్ళు స్రవించాయి - యోహా 19, 34. ఈ నీళ్ళు పరిశుద్దాత్మనూ, మెస్సీయా కొనివచ్చే వరప్రసాదాలనూ సూచిస్తాయి. పూర్వవేదంలోను నూతవేదంలోను చాల వేదవాక్యాలు జలాలు ప్రవహించడాన్ని గూర్చి చెస్తాయి. ఈ యాలోకనాలు క్రీస్తు ప్రక్కలో నుండి కారిన నీటిని కొంతవరకు సూచనంగా వుంటాయి. ప్రస్తుతం ఈలాంటి వాక్యాలను ఆరింటిని పరిశీలిద్దాం.

1. యిప్రాయేలీయులు సీను ఎడారిలో ప్రయాణం చేసేప్పుడు నీళ్ళు దొరక్క బాధపడ్డారు. మోషేమీద గొణిగారు. మోషే యావే యాజ్ఞపై పూర్వం తాను నైలునదిని కొట్టిన బెత్తంతో రాతిబండను మోదాడు. వెంటనే ఆ బండనుండి అద్భుతంగా నీళ్లు వెలువడ్డాయి. ప్రజలు వాళ్ళ పశువులు ఆ నీళ్లు త్రాగారు - నిర్గ 17,1-7. మోషే రాతిబండను కొట్టినట్లే సైనికుడు క్రీస్తుప్రక్కను బల్లెంతో పొడిచాడు. ఆ రాతిబండ నుండి జలం స్రవించినట్లే, క్రీస్తు ప్రక్కలో నుండి కూడ నీళ్ళు కారాయి. పౌలు, మోషే కొట్టిన రాయి క్రీస్తుకి చిహ్నంగా వుంటుందని చెప్తూ ఈలా వ్రాసాడు. “యిస్రాయేలీయులందరూ ఆధ్యాత్మికమైన ఒకే పానీయాన్ని త్రాగారు. వాళ్ళు తమతో పాటు ప్రయాణం చేసిన ఆధ్యాత్మిక శిలనుండి దాహం తీర్చుకొన్నారు. ఆ శిల క్రీస్తే" - 1కొరి 10,4.

2. "మీరు ఆనందంతో రక్షణపు చెలమ నుండి నీరు చేదుకొంటారు" అంటుంది యెషయా ప్రవచనం 12, 3. ఈ రక్షణపు చెలమ ఈటెతో తెరువబడిన క్రీస్తు హృదయమే. దానినుండి స్రవించేది రక్షణనొసగే జలం.

3. "దేవాలయం క్రిందినుండి ఒకయేరు పారుతుంది.ఆది దేవళం కుడివైపునుండి పారుతుంది. ఆ యేరు పారేకాడల్లా రకరకాల మృగాలూ చేపలూ జీవిస్తాయి. ఆ యేటి