పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవించావు. నేను ఒంటరిగా కష్టాలు అనుభవించవలసి వచ్చినపుడు, పరుల సహాయం పొందలేని నీ దీనస్థితిని ధ్యానించుకొంటాను.

బాధలను అనుభవించేవాళ్ళను అందరూ చేయివిడుస్తారు. ఫనోరవేదనల్లో చిక్కినపుడుకూడ బాధితులు ఒంటరిగా నిలువవలసిందే. వారి హృదయంలోని వ్యధను అర్థంజేసికొని పాపం అనేవాళ్ళ ఎవ్వరూ వుండరు. ఆలాంటి సమయంలో కష్టాలనుభవించే వ్యక్తి ఓదార్పుకై ఇతరులను సమీపించినా వాళ్ళు అది ఒక తగులాటకంగా భావించి ప్రక్కకు తొలగిపోతారు. నాయనా! మా తిప్పలు మాకు జాలు. నీ సాదతో మాకేమి పని అన్నట్లుగా ప్రవర్తిస్తారు.

ఈలాంటి దారుణ పరిస్థితి సంభవించినపుడు ప్రభూ! నీవు నాచెంత నిలచి ఒంటరితనానికి బెంగపడవలదని నన్ను హెచ్చరించు. చీటికిమాటికి కన్నీరొలుకుతూ ఓదార్పు కోసం నేనితరుల చెంతకు పరుగెత్తరాదు. నీ సహాయంతో నాయంతట నేను నిలువాలి.

చిట్టచివరన, ప్రతివ్యక్తి తన బాధలను తాను ఒంటరిగా భరించవలసిందే. ఒకరి వేదనలను మరొకరు తీర్చలేరు, ఈ సత్యం ఈనాడుగాకున్న రేపన్న ప్రతి వ్యక్తికి అర్థమౌతుంది. నేనుగూడ ఈ సత్యాన్ని గ్రహించిననాడు నీవు పంపే బాధలను ఓర్పుతో సహిస్తాను. కనుక నా విపత్తులలో కలతపడి అనవసరంగా మనసు పాడుచేసికోక నమ్మకంతో నినాశ్రయింతునుగాక.

నీవు విశ్వాసపాత్రుడవు, నిన్ను నమ్మినవారిని చేయి విడువవు అనే నమ్మకం మాత్రం నాలో పెంపొందించు. నాకు అదే పదివేలు.

ఆరవ స్థలం

వెరొనిక క్రీస్తుకి వస్త్రం అందించడం

అందరూ క్రీస్తుని విడనాడారు. ఇరువైపుల మూగివున్నవారంతా నిర్దయతో అతన్ని బాధిస్తున్నారు. ప్రభువు అడుగడుక్కి సత్తువను గోల్పోయి, అధికమౌతున్న ఆయాసం వలనా దప్పిక వలనా బాధపడుతున్నాడు. దేహంలోను ఆత్మలోను క్రుంగదీసే ఘోరవ్యధ. స్లీవభారం నిమిషనిమిషానికీ ఎక్కువొతూంది. ప్రభువు ఏ క్షణంలో ఎటువైపు పడిపోతాడో తానే ఎరుగడు.

ఈలాంటి విషమ పరిస్థితుల్లోజిక్కినపుడు మానవులు తీరని నిరాశకు గురౌతారు. ఎదుటివారి పలుకులనూ చేతలనూ అనాదరణంచేసి పిచ్చివాళ్ళలాగ ఒక్కబిగిని ముందుకు