పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాగిపోతారు. వేరోనికవంటి పుణ్యస్త్రీలు ప్రక్కనుండి ఏదైనా సాయం జేయబోయినా దాన్ని గమనించకుండానే ముందుకి వెళ్ళిపోతారు.

కాని క్రీస్తు అలా చేయలేదు. తాను పుట్టెడు దుఃఖలో మునిగివున్నా స్త్రీవతో సతమతమగుతూన్నా పరులమంచితనాన్ని గుర్తించే తన మార్ణవ గుణాన్ని ఏమాత్రం కోల్పోలేదు. ఆ పేద స్త్రీ అందించే చేతి గుడ్డను ఆదరంతో గైకొని ఆమెను బహూకరించాడు. ఆ బట్టతో తన ముఖాన్నితుడుచుకొన్నాడు. తత్ఫలితంగా తన దివ్యముఖం ముద్రింపబడిన ఆ వస్తాన్ని నెనరుతో తిరిగి ఆమె చేతికి అందించాడు.

ప్రార్ధనం

స్నేహమూర్తివైన ప్రభూ! నీ మనసెంత మృదువైనది! ఉదాత్త హృదయాలన్నిటికంటె ఉత్తమమైనది నీ స్నేహ హృదయం. ఈ ప్రపంచంలోని సుఖదుఃఖాలను అనుభవిస్తున్నా వాటిని సులభంగా దాటిపోగలది నీ విశాల హృదయం.

జీవన్ముకుడవైన క్రీసూ! నన్ను కూడ ఈ ప్రపంచంలోని సుఖదుఃఖాలనుండి ఆవలకు నడిపించు. నేను వ్యధలలో చిక్కి మనసు చెడగొట్టుకొని నా తోడివారిని అనాదరం చేస్తూంటాను. అలాంటప్పుడు బాధిత హృదయులకు సులభంగా అలవడె స్వార్థబుద్ధినుండి నన్ను కాపాడు. నిరంతరం నన్నుగూర్చే నేను తలంచుకోవడం, నా బాగోగులను గూర్చే నేను ఆందోళనం చెందడం అనే పెనుభూతం నుండి నన్ను రక్షించు. ఇతరుల పరిచర్యలకీ ఆదరణకీ ఏదో హక్కుగలవానివలె ప్రవర్తించడం, ఇతరులకు భారం కావడం, నా బాధల నెపంతో ఇతరుల ఆనందాన్ని చెడగొట్టడం మొదలైన అనిష్టగుణాలనుండి నన్ను ఉద్ధరించు.

నేను ఇతరుల ప్రేమతోజేసే ప్రతి స్వల్ప పరిచర్యను వెంటనే గుర్తించి సంతోషంతో స్వీకరించి కృతజ్ఞతను తెలియజేయుదునుగాక. పరులకు నావలన ఏదైనా కొంచెంమేలు జరగాలనే తలంపుతో జీవింతునుగాక. నా దృష్టి నానుండి ఇతరుల వైపునకు మరల్చిన వెంటనే నా బాధలు చాలవరకు తీరిపోతాయి.

కావున ప్రభూ! ఇతరులను అర్థంచేసికొని వారి బాగోగులనుగూడ విచారించే విశాలహృదయాన్ని నాకు అనుగ్రహించు. నీ కృపవలన నా తోడివారిని గూర్చి ఒక మంచి పలుకు పల్కి వారి వేదనలను కొంచెం ఉపశమింపజేసి, నన్ను నేను కాస్త మరచిపోయి స్వార్థంలేని పరోపకార జీవితం గడుపుదునుగాక.