పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్రోవవెంటనే నడుసూ జీవితాంతం నీ దుఃఖపథాన్ని అనుసరింపగోరుతున్నాను. ఆనాడు నా కొరకై నీవనుభవించిన బాధలను జ్ఞప్తికి తెచ్చుకొని ధ్యానంచేసికొనే భాగ్యాన్ని నా కనుగ్రహించు. నా కొరకై నీవు చూపిన మహత్తర ప్రేమను కొద్దిగానైనా అర్థంజేసికోవడానికి నా నేత్రాలను విప్ప, నా హృదయాన్ని స్పందింపజేయి. నా ఆత్మను ప్రబోధించు. నీ బాధలకు కారణమైన నా పాపాలను పరిత్యజించి, నీ కృపవలన ఇకమీదట నైనా సన్మార్గంలో నడిచే భాగ్యాన్ని దయచేయి.

      నేను గతాన్ని వదలి నూత్న జీవితాన్ని ఆరింభింపగోరుతున్నాను. నీవు నడచిన త్రోవవెంటనే నడువగోరుతున్నాను. తండ్రీ! నా యీ ప్రయత్నాన్ని దీవించి, నీ చేయిచ్చి నన్ను ముందుకు నడిపించు.
      బాధామయుడవైన ప్రభూ! నీవలెనే నేనుగూడ నా సిలువను మోసికొని రాగల శక్తిని దయచేయి. ఉపదేశపూర్వకంగాను, ఆచరణ పూర్వకంగాను ఆనాడు నీవు వివరించిన బాధాతత్వాన్నినేడు నేను అర్థంచేసికొనేలా చేయి. నీ బాధల ఫలితంగా, నేడు నా పాలబడే శ్రమలన్నిటినీ మంచి మనస్సుతో స్వీకరింతునుగాక. నీ శ్రమల వరప్రసాదం నా శ్రమలమీద సోకి వాటిని ఫలప్రదం చేయునుగాక. ఆమెన్

మొదటి స్థలం

పిలాతు యేసునకు మరణపు తీర్పు విధించడం

యేసుక్రీస్తువా! మిమ్మ ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్తీవచేత లోకమును రక్షించితిరి.

క్రీస్తు న్యాయస్థానంలో నిల్చుండి వున్నాడు. కూటసాక్షులు అతనిపై నేరం మోపుతూన్నారు. న్యాయమూర్తియైన పిలాతు శీలసంపత్తిలేని స్వార్థపరుడు. అసలు క్రీస్తుని అచటికి తీర్పుకి కొనివచ్చిందే న్యాయవిరుద్ధమైన పద్ధతిలో అట్టి అన్యాయపు పరిస్థితిలో క్రీస్తుని ద్రోహియని నిర్ణయించారు. ఆ తీర్పు ఫలితంగా క్రీస్తు అనుభవింపబోయే శిక్ష చాల అవమానకరమైంది, ఘొరమైంది, భయంకరమైంది.

తాను నిర్దోషినని, నిష్కల్మషచిత్తుడనని, క్రీస్తుకి బాగా తెలుసు. అతడు ప్రజలను గాఢంగా ప్రేమించి వారి మేలుకొరకు, రక్షణం కొరకు అహోరాత్రులు క్షీణించిపోయినవాడు. ఐనా పరులమేలుగోరే తన్ను ఆ ప్రజలూ, ఆ న్యాయమూర్తీ విడూరంగా ద్రోహియని నిర్ణయించినపుడు అతని హృదయం తీరని బాధతో కుమిలిపోయింది. ఆరని వ్యధతో కృంగిపోయింది.