పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యెన్నుకొన్నాడు" 7, 6-9.ప్రభువప్రజలు కావడానికి యూదులకు ప్రత్యేకార్హత యేమీలేదు. ఇతర జాతులకంటె వాళ్ళ యోగ్యులేమీ కాదు. ఐనా అతడు స్వయంగా ఆ ప్రజను ప్రేమించాడు. కనుక వాళ్ళను ఎన్నుకొని తన సొంత ప్రజను చేసికొన్నాడు.

అలా యెన్నుకొనిన ప్రజను ప్రభువు ఐగుప్న దాస్యం నుండి విడిపించాడు, సీనాయి కొండదగ్గర వాళ్ళతో నిబంధనం చేసికొన్నాడు. ఈ నిబంధనాన్ని గూర్చి నిర్గమకాండం ఈలా చెప్తుంది. "నేను ఐగుప్త ప్రజలకు ఏమిచేసానో మీరు కన్నులార చూచారు. గరుడపక్షి తన పిల్లలను రెక్కలమీద మోసికొని పోయినట్లే నేనూ మిమ్మ మోసికొనివచ్చి నా చెంతకు చేర్చుకొన్నాను. దీనిని బట్టి మీరు ఓ సంగతి గమనించండి. మీరు నా మాట విని నా నిబంధనను శ్రద్ధగా పాటిస్తే సకల జాతులలోను మీరే నావారూ, నా సొంత ప్రజలూ ఔతారు. ఈ భూమండలమంతా నాదేకదా! మీరే నాకు యాజకరూపరాజ్యం. మీరే నా పవిత్ర ప్రజ" - 19, 4-6, ఆనాడు భూమిమీద నానాజాతులుండగా ప్రభువు యిస్రాయేలీయులనే తన సొంత ప్రజగా ఎన్నుకొని వారితో నిబంధనం చేసికొన్నాడు. దాని ఫలితంగా వాళ్ళు ప్రభువుని కొల్చే ప్రజలయ్యారు. అతనికి యాజకులయ్యారు. పూర్వం వాళ్లు ఫరోని సేవించే బానిసలు. కాని యిప్పడు యావేను సేవించి అతన్ని అర్చిస్తారు. అందువల్ల వాళ్లు పవిత్రులౌతారు, యావే వాళ్లకు దేవుడౌతాడు. తాము అతని ప్రజలౌతారు.

ఈ రీతిగా యూదులు ఎన్నికా నిబంధనలద్వారా దైవప్రజలయ్యారు.

2. పూర్వవేద ప్రజల బిరుదాలు

యూదులు దైవప్రజలైనందున వాళ్ళకు అనేక బిరుదాలు లభించాయి. ప్రస్తుతం వాటిల్లో కొన్నిటిని పరిశీలిద్దాం.

1. పవిత్రప్రజ - ద్వితీ 7, 6 యూదులు కొలిచే దేవుడు పవిత్రుడు. కనుక అతనిలాగే అతని భక్తులుకూడ పవిత్రులై యుండాలి — లేవీ 19,2. 

2. దేవుని సొంతప్రజలు - నిర్గ19,5. ఆ రోజుల్లో ఓ ఆచారముండేది. దేశమంతా రాజుదే. ఐనా ఆ దేశంలో కొంతభూమిని రాజుకి ప్రత్యేకంగా కేటాయించే వాళ్ళ ෂ ද්රාදේශීඩාණ්oධී వచ్చే ఆదాయాన్నిరాజు స్వయంగా అనుభవించేవాడు. ෂධි ෂහීදී) ప్రత్యేకభూమి. ఆలాగే ఈ భూమండలమంతా యావేదే. ఈ లోకంలోని జాతులన్నీ అతనివే. ఐనా అతడు ఆ జాతుల్లో ఒక దాన్ని తన ప్రత్యేక ప్రజనుగా ఎన్నుకొన్నాడు, వాళ్లే యూదులు. ఆజాతి అతనికి సొంతప్రజలై అతని ఆదరాభిమానాలను చూరగొంటారు.