పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. వారసంగా లభించిన ప్రజలు - నిర్గ 349, కుమారునికి తండ్రినుండి ఆస్తిపాస్తులు వారసంగా లభిస్తాయి. ఆ వారసాన్ని అతడు అమూల్యంగా యెంచుతాడు. ప్రీతితో జూచుకొంటాడు. ప్రభువు యిస్రాయేలీయులను ఫరో దాస్యంనుండి విడిపించడం ద్వారా వాళ్ళు అతనికి వారసపు ఆస్తి అయ్యారు. అనగా ఆ ప్రభువుకి వాళ్ల విలువకలవాళ్లు, ప్రీతిపాత్రులు ఔతారని భావం. 4. ప్రభువు మేపే మంద - కీర్త95,7. కాపరి తన మందను శ్రద్ధతో మేపుతాడు. ఆలాగే ప్రభువుకూడ తన మందమైన యిప్రాయేలీయులను ఆదరంతో కాచి కాపాడతాడు. 5. ప్రభువు పెంచే ద్రాక్షతోట - యెష 5,1. కాపు తన పొలాన్ని సాగుచేసి దానిలో ద్రాక్షలు పెంచుతాడు. ప్రభువుకూడ తన ప్రజను సొంత తోటనులాగ పరామర్శిస్తాడు అని భావం. 6. ప్రభువుకి పుత్రుడు - నిర్గ 422 ఎన్నికద్వారా యిప్రాయేలు ప్రభువుకి పత్రుడయ్యాడు. అతడు ఫరో పత్రుడ్డి వధించి తన పత్రుడైన యిస్రాయేలుని కాపాడాడు. ఆ ప్రజలు అతనికి ప్రీతిపాత్రులయ్యారని భావo. 7. ప్రభువు వధువు - యిర్మీ 2,2. వరుడు తన వధువుని అనురాగంతో జూచుకొంటాడు. ఆలాగే ప్రభువు యిప్రాయేలుని ప్రేమతో ఆదరిస్తాడు. 8. యాజకరూపరాజ్యం - నిర్గ 19,6. యిప్రాయేలీయులు ఫరోను కొల్వడం మాని యావేను కొలుస్తారు. అతనికి అర్చకులౌతారు. అతని పావిత్ర్యంలో తామూ పాలుపొందుతారు. అన్యజాతుల్లా కాకుండ తాము పవిత్ర ప్రజగా రూపొందుతారు. 9. ప్రభువుకి సాక్షులు - యెష 44,8. యిప్రాయేలీయులు ప్రభువు ఆజ్ఞలు పాటిసూ అతని మార్గాల్లో నడుస్తారు. ఇతరజాతులకు ఆ ప్రభువుని చాటిచెప్తారు. అన్యలను ఆ ప్రభువు దగ్గరికి ఆకర్షిస్తారు. ఈరీతిగ అతనికి సాక్షులౌతారు.

పైన పేర్కొన్నయిస్రాయేలీయుల బిరుదులన్నీ నూత్న వేదంలో క్రైస్తవప్రజకు కూడ వర్తిస్తాయి.

3. పూర్వవేద ప్రజల లక్షణాలు

పూర్వవేద ప్రజలకు కొన్ని లక్షణాలు చెల్లుతాయి.వాటిని క్రమంగా పరిశీలిద్దాం. 1. జాతి నియమం. యిప్రాయేలీయులు యూదజాతికి చెందినవాళ్లు, పితరులైన అబ్రాహాము, ఈసాకు, యాకోబు ఈ జాతికి మూలపురుషులు. - యోష 63, 16. కాలక్రమంలో అన్యజాతులవాళ్ళకూడ వచ్చియిస్రాయేలీయులలో