పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాల్చివేసారనీ నేడూ పత్రికల్లో చదువుతుంటాం. నరుడ్డి నరుడు పసరంగా జాడడమంటే యీదేగదా!

19. మియాలో గొప్పవాడు కాదలచుకొన్నవాడు విూకు పరిచారకుడైయుండాలి - మార్కు 10,43

పాలకులు పాలితులనూ పైయధికారంలో వున్నవాళ్ల క్రింది వారినీ నిరంకుశంగా పరిపాలిస్తూంటారు. వాళ్ల విూద పెత్తనమూ అధికారమూ చెలాయిస్తూంటారు. కాని తన శిష్యులు ఈలా ప్రవర్తించకూడదన్నాడు క్రీస్తు, తన శిష్యులు అధికారంలో వున్నపుడు క్రింది వాళ్లమిూద పెత్తనంజేయడంగాదు, వాళ్లకు పరిచర్యలు చేయాలన్నాడు. స్వార్థంలేని నాయకుడూ అధికారీ క్రిందివాళ్లకు మేలు చేస్తాడన్నాం. ఆ మేలే అతడు చేసే పరిచర్య కనుక మనం యథార్థంగా క్రీస్తు శిష్యులమైతే పేద ప్రజలకు మేలూ పరిచర్యా చేయడం నేర్చుకోవాలి.

విూదటి అంశంలో అస్పృశ్యతను పేర్కొన్నాం. ఇంత ఘోరమైంది కాకపోయిన ఈలాంటిదే కులవ్యవస్థకూడ కులం భగవంతుడు కలిగించిందికాదు, నరుడు అన్యాయంగా తెచ్చిపెట్టింది. ప్రపంచంలోకెల్లా మనదేశంలో మాత్రమే కులాలంటూ వున్నాయి. కులంపేరు మిూదుగా నరులు కొన్ని వర్గాలుగా చీలిపోయి, ఒకవర్గంవాళ్లని మరోవర్గంవాళ్లు అనాదరం చేస్తూంటారు. మనదేశంలో కొన్ని పెద్దకులాలూ కొన్నిచిన్నకులాలూను. పెద్దకులాలకున్న వసతులూ సదుపాయాలూ చిన్న కులాలకు లేవు. అందుచేత రోజురోజుకీ పెద్దకులాలవాళ్లు వృద్ధిలోనికి వస్తూంటారు, చిన్నకులాలవాళ్లు అణగారి పోతూంటారు.


20. తన్ను తాను.హెచ్చించుకోవడం - లూకా 18, 14


కలవాళూ ధనవంతులూ కన్నూమిన్నూ కానకుండా తిరుగుతూంటారు. వాళ్లకు పేదల కష్టాలు తెలిసిరావు, వీళ్లు మాకేమి కొదవ అన్నట్ల మిడిసిపడుతూంటారు, విర్రవీగుతూంటారు. కాని ఈలాంటి వాళ్లను గూర్చి ప్రభువు తన్నుతాను హెచ్చించు కొనేవాడు తగ్గింపబడతాడు అని మందలించాడు. కాని తన్నుతాను తగ్గించుకొనేవాడు ఆ ప్రభువు చేతనే హెచ్చింపబడతాడు. కనుక మనం భూలోక సంపదలు అమరాయిగదా అని తలబిరుసుతనంతో తిరుగగూడదు. పేదలను చిన్నచూపు చూడనూగూడదు.


మనదేశంలో /ఉద్యోగులకు లభించే వేతనాలుగూడ చాల తక్కువ. ముగ్గురు సభ్యులుగల విద్యావంతుల కుటుంబానికి నెలకు కనీసం 1000 రూపాయలు అవసరమని