పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17. మనుష్యకుమారుడు సేవలు చేయడానికి వచ్చాడు - మార్కు 10,45

క్రీస్తు నేను సేవలు చేయించు కోవడానికి కాదు, సేవలు చేయడానికి వచ్చానన్నాడు. స్వార్థపరుడైన నాయకునికీ స్వార్థం లేని నాయకునికీ ప్రధాన భేదం ఇక్కడే వుంది. స్వార్థపరుడైన నాయకుడు ఇతరులచేత సేవలు చేయించుకొంటాడు. స్వార్థంలేని నాయకుడు తాను ఇతరులకు సేవలు చేస్తాడు. క్రీస్తు అలా యితరులకు సేవలు చేసాడు. తన ప్రాణాన్నే యితరుల కొరకు సమర్పించాడు. ఈలాగే మనంకూడ నేటి పీడిత ప్రజానీకానికి సేవలు చేయాలి. ఆ సేవలుకూడ నిస్వార్థబుద్ధితో చేయాలి.

మనదేశంలో వెట్టిచాకిరి అనే దురాచారం ఒకటుంది. పేదలు ధనవంతుల దగ్గర బాకీ తెచ్చుకొంటారు. ఆ బాకీ తీరిందాకా ఆ పేదవాళ్ల కుటుంబం తరతరాలూ ఆ ధనికుల కుటుంబానికి ఉచితంగా చాకిరి చేయాలి. ఈలా ధనవంతుల పొలాల్లో చాకిరి చేసేవాళ్లను పాలేరు అంటారు. ఈ యాచారం మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వాడుకలో వుంది. ఇటీవలే మన ప్రభుత్వం ఈ వెట్టిచాకిరిని రద్దుచేస్తూ ఓ శాసనం చేసింది. ఈ వెట్టిచాకిరి విధానం ప్రకారం నరులు 8 నరుడ్డి బానిసగా వాడుకొంటారు. ఇది చాల పెద్ద అన్యాయం అనాలి.

18. బోధకుడను ప్రభువునైన నేనే విూకాళ్ళు కడిగితే - యోహా 13,14

క్రీస్తు తాను సేవకుణ్ణని వెల్లడించుకోవడం మాత్రమే గాదు. అచ్చంగా సేవకుళ్లాగే ప్రవర్తించాడు. అతడు శిష్యుల పాదాలు కడిగాడు. ఆరోజుల్లో బానిసలూ సేవకులూ యజమానుల పాదాలు కడిగేవాళ్లు. కనుక శిష్యుల పాదాలు కడగడం ద్వారా క్రీస్తు తన వినయాన్నీ సేవాభావాన్నీ ప్రదర్శించాడు. తోడి ప్రజలకు చిత్తశుద్ధితో సేవలు చేయడమంటే ఈలాగుండాలి. ప్రభువు శిష్యుల పాదాలు కడిగినంక విూ "గురువును ప్రభువునైన నేను విూ పాదాలు కడిగాను. నన్ను ఆదర్శంగా పెట్టుకొని మిరూ ఒకరి పాదాలొకరు కడుగుతూండండి" అన్నాడు. కాని నేడు ఈ యాదర్శాన్ని పాటించే క్రైస్తవులెంతమంది?

మనదేశాన్ని పట్టిపీడించే మహారోగాల్లో అస్పృశ్యతా రోగమొకటి. మనవాళ్ళు నరుల్లో కొంతమందిని ముట్టుకోరాదన్నారు. వీళ్ళే దళితులు లేక పంచములు. తరతరాలుగా ధనికవర్గాలవాళ్ళు పేదవర్గాలను అణగదొక్కుతూ వచ్చారు. వాళ్ళను బానిసలుగా వాడుకొంటూ వచ్చారు. కడన వాళ్ళను ముట్టుకొంటేనే మైలపడిపోతాం అనే కాడికి వచ్చారు. ఈ యస్పృశ్యతా పిశాచం నేటికీ పల్లెప్రాంతాల్లో వికటాట్టహాసం చేస్తూనేవుంది. పెద్ద కులాలవాళ్లు దళితుల వాడలమిద దౌర్జన్యం చేసారనీ, దళితులను నిలువన