పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11. ధనవంతుడూ, లాజరూ - లూకా 16,19-26

ఓ ధనవంతుడూ లాజరు అనే ఓ పేదవాడూ ఉండేవాళ్లు, ధనవంతుడు పట్టవస్తాలతో, విందులూ వినోదాలతో కాలక్షేపం చేస్తుండేవాడు. లాజరు తన పండ్ల కుక్కలు నాకుతూండగా ఆ ధనవంతుని యింటిముందు పడిఉండేవాడు. ధనవంతుని బల్ల విూదినుండి జారిపడిన యెంగిలి మెతుకులు తిని రోజులు గడుపుతూండేవాడు. తర్వాత పాళ్లిద్దరూ చనిపోయారు. లాజరు అబ్రాహాము ఒడిలోనికీ ధనవంతుడు పాతాళానికీ చేరుకొన్నారు. ఈలా ఈ జీవితంలో సుఖించిన ధనవంతుడు మరు జీవితంలో కష్టాలకు గురయ్యాడు. ఇక్కడ కష్టాలనుభవించిన లాజరు మరుజీవితంలో సుఖాన్ని పొందాడు. ఈలా క్రీస్తు పేదలను పొగడుతూ ధనవంతులను తెగడుతూ చాలా బోధలు చేసాడు. ఆ ప్రభుబోధలు నేడూ మన సమాజానికి అక్షరాల వర్తిస్తాయి.

మన ఆసియా ఖండంలో, విశేషంగా యిండియాలో ఉన్నంత సాంఘిక వ్యత్యాసం మరేఖండంలోను కన్పించదు, మన దేశంలో ఈ ప్రక్కన ఆకాశాలంటే ధనికుల మేడలు. వాటికెదురుగానే ప్రక్కన పేదజనుల పూరిపాకలు. ఈ మేడల్లో విందులూ, పరమాన్నభోజనాలు, త్రాగుళ్లు, ఆ వూరి పాకల్లో పస్తులూ, ఒంటిపూట కూళూనూ, ఈ మేడల్లో వసించే స్త్రీ పురుషులు పట్టుబట్టలతో, టెర్లిను నైలెను దుస్తులతో విలాసంగా తిరుగుతూంటారు. ఈలాగే మన సమాజంలో పేదలకూ ధనవంతులకూ మధ్య బోలెడన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి.

12. ఏమి తిందామా ఏమి కట్టుకొందామా అనే ఆందోళనం - మత్త 6,26-33

నరులు చాలమంది తాము బ్రతికే బ్రతుకుకొరకూ, తినే తిండికొరకూ కట్టే బట్టకొరకూ ఆందోళనపడుతూంటారు. కాని ఈలాంటి ఆందోళనం అనవసరం అన్నాడు ప్రభువు. ఎంత ఆందోళన పడినా మన ఆయువును కొన్ని క్షణాలకాలమైనా పెంపొందించుకోలేం గదా! ఆకాశపు పక్షులను పోషించే ప్రభువనరులకు కూడు దొరికేలా చేయడా? గడ్డి మొక్కలను పూలతో అలంకరించే దేవుడు నరులకు ಬಳ್ಳಿಲು එබීරයී మార్గం చూపించడా? కనుక నరుడు దేవుని విూద భారం వేసి జీవిస్తూండాలి. పురుషకారమూ దైవమూ ఈ రెండింటిలో దేనికీ భంగం కలుగకుండా తన ప్రయత్నం తాను చేస్తూండాలి.

కూడూ గుడ్డాయిలల్లా బ్రతుకూ వీటిని గూర్చి ఆందోళన పడగూడదన్న క్రీస్తు బోధ ధనికవర్గాలకూ పేదవర్గాలకూ గూడ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ యాందోళన