పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. ఒంటె సూది బెజ్జంలో దూరడం - మార్కు 10,25

క్రీస్తు ధనవంతులను గూర్చి చెప్పిన వాక్యాలు కొన్ని వున్నాయి. ధనాన్ని కూడబెట్టడంలో తప్పేవిరాలేదు, కాని తరచుగా ధనవంతుల హృదయం ఆ ధనంమిూదికే పోతుంది గాని దేవుని విూదికి పోదు. అందుకే ధనవంతులు రోజురోజుకీ దైవరాజ్యానికి దూరమై పోతూంటారు. కనుక ఒంటె సూది బెజ్జంగుండా దూరడం ఎంత కష్టమో ధనికుడు మోక్షాన్ని చేరుకోవడం అంతకష్టం అన్నాడు ప్రభువు, మరోతావులో క్రీస్తు ఈలోకంలో సంపదలు చేకూర్చి పెట్టవద్దన్నాడు. ఈలోకంలో కూడబెట్టే డబ్బును త్రుప్ప చిమ్మటలు దొంగలు కాజేస్తారు. కనుక పరలోకంలో మన ನಿಮ್ಮಿ దాచుకోవాలి - మత్త 6, 19.

మనదేశపు రైతుల్లో 15 శాతం ధనవంతులు, తతిమ్మా వాళ్ళంతా పేదరైతులు, ఈ ధనవంతులైన రైతులకు మూలధనముంటుంది కనుక పెట్టబడి పెట్టగలరు. మంచి విత్తనాలు, ఎరువులు కొనగలరు, సకాలంలో పని చేయించగలరు. కనుక వీళ్ళ రోజు రోజుకీ వృద్ధిలోకి వస్తుంటారు. ఇక పేద రైతులు పెట్టబడి పెట్టలేరు. కనుక వాళ్ళ ఏటేటికి అణగారి పోతుంటారు. ఈ రీతిగా రైతాంగంలో కొద్దిమంది బలిసిపోతూంటారు. అధిక సంఖ్యాకులు మాత్రం బడుగులై పోతూంటారు.

10. ఎవడూ ఇద్దరు యజమానులను సేవించలేడు - మత్త 6,24

ఒకవైపు ధనమూ మరోవైపు దైవమూ అని యిద్దరు యజమానులున్నారు. మనం ఈ యిద్దరినీ సేవించలేం. దేవుణ్ణి సేవిస్తే ధనాన్ని వదలుకోవాలి. ధనాన్ని సేవిస్తే దేవుణ్ణి వదలుకోవాలి. అందుకే ప్రభువు ఇంకో తావులో ధనికులు ఇక్కడ సుఖాలనుభవిస్తారుగాని తర్వాత వాళ్ళకు దౌర్భాగ్యపు గతి పడుతుంది అన్నాడు - లూకా 6,24.

మనదేశంలో చాలమంది బడుగు రైతులు ఉన్నారని చెప్పాం. వీళ్ళ పెట్టబడికి డబ్బు లేక బాకీ దారులను ఆశ్రయిస్తారు. ఈ వడ్డీ వ్యాపారులు 120 శాతం వరకు వడ్డీ తీసుకొంటారు. అనగా నూరు రూపాయలు అప్ప తీసికొంటే సంవత్సరాంతంలో మొత్తం 220 రూపాయలు చెల్లించాలి. దీనివలన పేదరైతులు గుల్లెపోతారు. వాళ్ళ పొలంలో పండిన కొద్దిపాటి పంట బాకీలు తీర్చడానికే చాలదు. ఈవిధంగా పేదలు పటేటికీ క్రుంగిపోతూంటారు.