పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రుడై యుంటాడని ఫలితార్థం. కనుక మనం అతన్ని ఆదరంతో ఆహ్వానించాలి. మన హృదయంలో వసించమని కోరుకోవాలి. మనకు తన విూద గాధమైన తృష్ణను కలిగించమని అడుగుకోవాలి.

ఇంకా ప్రభువు ఈలా నుడివాడు. "నన్ను ప్రేమించే వాడు నామాట పాటిస్తాడు. అప్పడు నా తండ్రి కూడ అతన్ని ప్రేమిస్తాడు. మేమిద్దరమూ వాని వద్దకు వచ్చి వానితో వసిస్తాం" - యో 14,23, నాల్గవ సువార్తలో మాట పాటించడం లేక ఆజ్ఞ పాటించడం అంటే సోదర ప్రేమను పాటించడమని భావం, సోదర ప్రేమతో జీవించే భక్తుడు పితకు ఇపుడౌతాడు. అలాంటి భక్తుని హృదయంలోకి క్రీస్తూ అతని తండ్రీ ప్రవేశిస్తారు. వాళ్లు అతని హృదయంలో నివాసమేర్పరచుకొంటారు. భక్తుడు సోదర ప్రేమతో జీవిస్తూ భగవంతుణ్ణి హృదయంలో నిల్పుకొంటాడని పైవాక్యం భావం, ఈలా మన హృదయంలో వసించే ప్రభువు పట్ల మనకు గాధమైన వాంఛా అనుభవమూ కలగాలని మనవి చేసికోవాలి.

5. ఆత్మ అనుగ్రహం

ఆత్మను గూర్చి ఈ వ్యాసారంభం లోనే చెప్పాం. యధార్థంగా మనకు భగవంతుని విూద కోర్మెను పట్టించేది ఆ యాత్మే మనం తండ్రిని గాని కుమారుని గాని కోరుకొనేలా చేసేది ఆత్మే. "నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవడూ నావద్దకు రాలేడు" అన్నాడు క్రీస్తు - యోహా 6,44. ఈ యాకర్షణే ప్రేమ. ఈ ప్రేమే పరిశుద్దాత్మ అనగా తండ్రి పరిశుద్దాత్మ ద్వారా భక్తుని క్రీస్తు చెంతకు రాబడతాడని భావం. కనుక మనలను క్రీస్తు చెంతకు చేర్చేదీ ఆత్మే ఆ యాత్మ క్రీస్తుని గూర్చి మనకు బోధ చేస్తుంది. విశేషంగా మనం అతని మరడోత్థానాలను అర్థం చేసికొనేలా చేస్తుంది. సంపూర్ణ సత్యమైన ఆ ప్రభువుని మనం ఆకళింపుకు తెచ్చుకొనేలా చేస్తుంది - యోహా 16,13-14 ప్రాచీన క్రైస్తవులు ఈ యాత్మడ్డి ఓ చిత్రకారునితో పోల్చారు. అతడు క్రీస్తు రూపాన్ని మన హృదయాల్లో చిత్రిస్తాడని చెప్పారు. మరి మనకు క్రీస్తు మిూద కోర్కెపట్టాలి అంటే ఈ యాత్మడు కాక ఇంకెవరు తోడ్పడతారు?

భగవంతుణ్ణి కోరుకోవడానికి ఒక్కటి ఆటంకంగా వుంటుంది - సృష్టి వస్తు వ్యామోహం. సుఖభోగాలు, ధనము, పదవులు, పేరుప్రతిష్టలు మొదలైన వ్యామోహాల్లో చిక్కుకొన్నవాళ్ళకు దేవుడు దర్శనమిూయడు. రాత్రిలో మేఘం చంద్రబింబాన్ని కప్పివేసి అది వెలుగును ప్రసరింపకుండా వుండేలా చేస్తుంది. అలాగే ఈ వస్తువ్యామోహం కూడా మన హృదయాన్ని కప్పివేస్తుంది, ఆ ప్రభువుని మన దృష్టి నుండి మరుగు పరుస్తుంది. ఎవరూ ఇద్దరు యజమానులను సేవింపలేరని ప్రభువే నుడివాడు. ఐహిక వస్తువులను సేవించేవాళ్ళ భగవంతుణ్ణి సేవించలేరు - మత్త 6,24.