పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెప్పందంటే అతడు దేవునికి ప్రతిమ లాంటివాడని భావం. ప్రతిమలో లాగే అతనిలోగూడ దేవుని శక్తి సాన్నిధ్యమూ నిండుకొని వుంటాయని తాత్పర్యం. ఈలాగే దేవుని శక్తినీ సాన్నిధ్యాన్నీ తనలో ఇముడ్చుకొని వున్న నరుడ్డి మనం గౌరవంతో చూడాలి. ఏమతం వాళ్ళల్లోనైనా సరే - కడకు నాస్తికుల్లో కూడ - ఈ లక్షణాలు వుంటాయి. కనుక నరులందరినీ మనం గౌరవంతో చూడవలసిందే. వాళ్ళల్లో వుండే దేవుని పోలిక అంత విలువైంది.

 2. నరుడు దేవునికి పోలికగా వుండేవాడు అన్నాం. కనుక ఆ నరుడు కూడ దేవుని లాగ పరిపూరుడుగా వుండాలి - మత్త 5,48. కాని ఈ పరిపూర్ణత్వం దేనిలో? మత్తయి 5,48 కి తుల్యమైన వాక్యం లూకా 8,86లో కన్పిస్తుంది. ఇక్కడ నరులు భగవంతుని లాగే కనికరం కలవాళ్లి వుండాలి అని చెప్పబడింది. కనుక నరుడు దేవునిలాగ పరిపూరుడయ్యేది విశేషంగా కారుణ్యంలో తోడినరుల పట్ల దయ, సానుభూతి, కరుణ, ప్రేమ కలవాడు ఉత్తమ నరుడు, ఇవే బైబులు భగవంతుని ప్రధాన లక్షణాలు.

 3. తోడి నరుళ్ళి భగవంతుని పోలికను గుర్తించేవాడు సామాజిక స్పృహను పెంపొందించుకొంటాడు. పేదసాదలను ఆదరంతో చూస్తాడు. అనాథులను కరుణతో ఆదరిస్తాడు. ఎవడైనా సరే దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పకొంటూ తోడి నరుడ్డి ద్వేషిస్తే అతడు అసత్యవాది. కంటికి కన్పించే తోడినరుణ్ణి ప్రేమించలేనివాడు, కంటికి కన్పించని దేవుణ్ణి ప్రేమించగలడా? - 1యోహా 4,20-21. ఇంకా మన విశ్వాసమూ సత్కార్యాలూ కలసిపోతూండాలి. కేవలం దేవుణ్ణి పూజిస్తే చాలదు. తోడినరులకు ఉపకారం కూడ చేస్తూండాలి. ఇరుగుపొరుగువాళ్ళు కూడుగుడ్డ కోసం అలమటిస్తుంటే మనకు చేతనైన సాయం చేయాలి. ఎందుకంటె వాళ్ళల్లో దేవుని రూపం వుంది కనుక - యాకో 2,1417. తోడిమానవుల్లోని దేవుని పోలికను గుర్తించడంలో ఇన్ని బాధ్యతలు వున్నాయి.

 4 రెండవ శతాబ్దంలో జీవించిన భక్తుడు ఇరెనేయుస్ ఈ క్రింది భావం చెప్పాడు. అన్ని జంతువులకూ తలలు నేల వైపు చూస్తున్నట్లుగా అమర్చబడ్డాయి. నరుని శిరస్సు మాత్రం పైకి చూస్తున్నట్లుగా అమర్చబడింది. అనగా ప్రాణులన్నిటి లోను నరుడొక్కడు మాత్రం పైకి, దేవుని వైపుకి, చూడగలడు. నరులమైన మనం దేవుని స్మరించుకోగలం, మోక్షాన్నిచేరుకోగలం. మృగాలకు ఈ శక్తి లేదు. పూజలో “విూ మనస్సులను ఉన్నతమునకు మర్చలండి" అని చెస్తాం. ఔను, దేవుని పోలికగల నరుడు తన మనస్సును ఆ పన్నతంలోని దేవునివైపు మరల్చుకోగలిగివుండాలి, అతడు జంతువులా కాదు, దివ్యడిలా ప్రవర్తిస్తుండాలి.

 5. తొలి మానవుడైన ఆదాములో దేవుని పోలిక వుండేది. కాని ఆ యాదాము పాపం వలన ఆ పోలికను పోగొట్టుకొన్నాడు. రెండవ ఆదాము తన సిలువ మరణం
38