పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వారా ఈ పోలికను పునరుద్ధరించాడు. ఇప్పడు మనం జ్ఞానస్నానం పొందేపుడు దేవుని పోలికా, క్రీస్తుపోలికా మన హృదయం విూద ముద్రితమౌతుంది. ఈ పోలికను ఈలా ముద్రించేది పవిత్రాత్మే ఆ దివ్యాత్ముడు గొప్ప చిత్రకారుడు. అతడు రోజురోజు క్రీస్తు రూపురేఖలను మన హృదయాల్లో చిత్రించుకొంటూ పోతుంటాడు. కనుక మనం క్రీస్తు పోలికను పొందాలి అంటే విశేషంగా ఆ యాత్మడ్డి మనవి చేసికోవాలి. ఆత్మ అనుగ్రహం లేందే మనకు క్రీస్తుపట్ల భక్తి కుదరదు - 1కొ 12,3.

3. హృదయం


బైబుల్లో హృదయమంటే నరుని వ్యక్తిత్వం. విశేషంగా నైతికమైన వ్యక్తిత్వం. హృదయం ద్వారా నరుడు భగవంతునితో సంబంధం పెట్టుకొంటాడు, క్రీస్తు హృదయం మన హృదయం విూద స్టోకి దానిని పవిత్రం చేస్తుంది. ఈ భావాలను సవివరంగా పరిశీలిద్దాం.

1. హృదయం లోని దుష్టత్వం


ప్రారంభంలోనే బైబులు, నరులు ఎల్లప్పడూ చెడ్డ పనులు చేయాలనే కోరుకొంటారు అని చెప్పంది - ఆది 6,5. నరుని ఆలోచనలు అతని యావనం నుండి కూడ దుష్టంగానే వుంటాయి అని వాకొంటుంది = ఆది 8,21. పాపం వలన పతనమైపోయిన నరునికి చెడుతనం సహజంగానే అలవడుతుంది. అందుకే నరుడు సున్నతిసంస్కారం లేని హృదయం కలవాడు అన్నాడు యిర్మీయా ప్రవక్త - 9,26. ఇక్కడ సున్నతిసంస్కారం లేని హృదయమంటే దేవుని ఆజ్ఞలను ధిక్కరించే గుండె, బండబారిన గుండె. హృదయంలోని దుష్టత్వం ప్రధానంగా దేవుని పట్ల మనం చూపే అవిధేయత లోనే వుంది.

2. ప్రభువు హృదయాన్ని పరిశీలిస్తాడు


మనం తరచుగా వెలుపలి ఆకారాన్ని చూచి నరుద్ధి మంచివాడి క్రిందనో చెడ్డవాడి క్రిందనో లెక్కకడతాం. కాని భగవంతుడు ఈలా చేయడు. అతడు నరుల అంతరంగాన్ని చూచి వాళ్ళ మంచి చెడ్డలను గణిస్తాడు. అందుకే సమూవేలు ప్రవక్త "దేవుడు నరుడు చూచే చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపాన్ని మాత్రమే చేస్తాడు. కాని దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు? అంటాడు - 1సమూ 16,7. నరుని హృదయాన్ని పరిశీలించే శక్తి మనకు లేదు. దేవుని కొక్కడికే వుంది. కావుననే యిర్మీయా ప్రవక్త
39